ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు ఎదుర్కుంటున్న ప్రధాన సమస్యలో బ్యాటరీ బ్యాకప్ కూడా ఒకటి. బ్యాగ్రౌండ్లో రన్ అయ్యే కొన్ని అప్లికేషన్లు స్మార్ట్‌ఫోన్ బ్యాటరీని వినియోగించుకోవటం వలన బ్యాటరీ బ్యాకప్ తగ్గుతూ ఉంటుంది. అయితే, ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు ఓ కొత్త ఆండ్రాయిడ్ అప్లికేషన్ అందుబాటులోకి వచ్చింది.
డియూ బ్యాటరీ సేవర్ (DU Battery Saver) పేరుతో గూగుల్ ప్లే స్టోర్‌లో లభిస్తున్న ఈ అప్లికేషన్‌ను ఫోన్లో ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే, మీ బ్యాటరీ అనవసర వినియోగాన్ని ఇది కంట్రోల్ చేస్తుంది. ఫోన్‌ని ఉపయోగించనప్పుడు అతి తక్కువ పవర్‌ను మాత్రమే వాడుకునేలా చేసేందుకు ఇందులో ప్రత్యేకమైన వ్యవస్థ ఉంటుంది.
ఒకే టచ్‌తో బ్యాటరీ బ్యాకప్ సమయాన్ని పెంచుకునేందుకు, బ్యాగ్రౌండ్ అప్లికేషన్లను నియంత్రించేందుకు, ఎంత సమయం వరకూ బ్యాటరీ నడుస్తుందో తెలుసుకునేందుకు, బ్యాటరీ ఎప్పుడు ఎంత ఛార్జ్ అయ్యిందో చూసుకునేందుకు, ఎక్కువ సేపు ఛార్జ్ కాకుండా నియంత్రించేందుకు కూడా ఇందులో ఏర్పాట్లు ఉన్నాయి.
డియూ స్టూడియో తెలిపిన సమాచారం ప్రకారం, మీ స్మార్ట్ఫోన్లలో ఈ అప్లికేషన్‌ను వాడటం వలన బ్యాటరీ సమయం దాదాపు 50 శాతం వరకూ ఆదా చేయవచ్చునని చెబుతోంది. ఇందులో ఫ్రీ వెర్షన్‌తో పాటు పెయిడ్ వెర్షన్ కూడా అందుబాటులో ఉంది. పెయిడ్ వెర్షన్ డియూ బ్యాటరీ సేవర్ ప్రో అప్లికేషన్‌ను కొనుగోలు చేసినట్లయితే 70 శాతం బ్యాటరీని సేవ్ చేసుకోవచ్చని కంపెనీ అంటోంది. మరి ఈ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ ఈ స్మార్ట్ అప్లికేషన్ ఉందా..? లేకపోయినట్లయితే ఇదిగో ఈ లింక్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి.
https://play.google.com/store/apps/details?id=com.dianxinos.dxbs