నిమ్మకాయను తలచుకుంటేనే నోరూరుతుంది. పుల్లటి రుచి కలిగిన నిమ్మకాయలో ఆరోగ్యాన్ని పెంపొందించే అనేక ప్రయోజనాలున్నాయి. నిమ్మకాయలో ఉండే విటమిన్ సి పొటాషియం, ఫాస్పారిక్ యాసిడ్లు మనం తీసుకునే ఆహారపదార్ధంలోని ఐరన్‌ను శరీరానికి వంటపట్టేట్టు చేసి రక్తహీనత నుండి కాపాడుతుంది.
తగిన మోతాదులో నిమ్మ రసాన్ని తీసుకుంటే, అది మూత్రపిండాలలో ఏర్పడే రాళ్లను కరిగిస్తుంది. అంతేకాదు, ఇది జీర్ణాశయంలో హాని కలిగించే క్రిములను కూడా నశింపజేస్తుంది.
రక్తకణాలలోని కొవ్వును కరిగించి రక్తప్రసరణ సక్రమంగా జరగడంలో నిమ్మరసం ఎంతో ఉపకరిస్తుంది. వేసవిలో కలిగే తాపాన్ని చల్లార్చేందుకు, చల్లని నీటిలో పంచదార మరియు నిమ్మరసం కలిపి సేవిస్తే వేసవి తాపం చల్లారుతుంది.
ఎక్కువగా వాంతులు చేసుకునే వారు నిమ్మరసాన్ని సేవించినా లేదా నిమ్మపండు వాససను పీల్చినా వాంతులు ఆగిపోతాయి. ఆకలిని పెంచడంలో కూడా తోడ్పడుతుంది. జ్వరంతో బాధ పడుతున్న నిమ్మరసం ఇస్తే అతిదాహం, తాపం తీరుతుంది.