ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉపకరణాల తయారీ సంస్థ లెనోవో తాజాగా మరో బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లో ప్రవేశపెట్టింది. కంపెనీ అందిస్తున్న లెనోవో ఏ6000 మోడల్‌కి మరియు ఏ7000 మోడల్‌కి మధ్యలో ‘ఏ6000 ప్లస్’ (Lenovo A6000 Plus) అనే మోడల్‌ను విడుదల చేసింది.
మార్కెట్లో లెనోవో ఏ6000 ప్లస్ ధర రూ.7,499 లుగా నిర్ణయించారు. ఈ ఫోన్ లకు సంబంధించిన మొదటి ఫ్లాష్ సేల్ ఏప్రిల్ 28, 2015వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు ప్రముఖ ఆన్లైన్ రిటైలర్ స్టోర్ ఫ్లిప్‌కార్ట్‌లో ఎక్స్‌క్లూజివ్‌గా ప్రారంభం కానుంది.
లెనోవో ఏ6000 ప్లస్ స్మార్ట్‌ఫోన్‌లో.. 5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 410 ప్రాసెసర్ (64 బిట్), 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 2,300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, 4జీ ఎల్టీఈ కనెక్టువిటీ వంటి ఫీచర్లున్నాయి.