అందమైన ప్రపంచమని అందరినీ వదులుకొని నేను వాగులు దాటుతున్నా..
కాసుల కోసం కుటుంబాన్ని, స్వదేశాన్ని విడిచి నేను వాగులు దాటుతున్నా..
సుఖమో దుఃఖమో, కష్టమో నష్టమో కానీ నేను వాగులు దాటుతున్నా..
వాగులకు ఇవతల కుటుంబం, అవతల భవిష్యత్తు..
దేనికి ప్రాధాన్యత ఇవ్వాలో తెలియని తికమకలో నేను వాగులు దాటుతున్నా..
పరాయి దేశంలో పాట్లెన్ని పడాల్నో..
కానీ గుండెల నిండుగ ధైర్యంతో నేను వాగులు దాటుతున్నా..
ఓ అందమైన అమెరికా.. నన్ను నీలో సురక్షితంగా దాచుకుంటావనే భావనతో బయలుదేరుతున్నా..