హ్యుందాయ్ ఇండియా అందిస్తున్న ప్రీమియం సెడాన్ ఎలాంట్రాలో కంపెనీ కొత్త 2015 వెర్షన్‌ను తాజాగా మార్కెట్లో విడుదల చేసింది. ఈ కొత్త 2015 హ్యుందాయ్ ఎలాంట్రా సెడాన్‌లో కొత్త ఫీచర్లను జోడించడంతో పాటుగా డిజైన్‌లో కూడా కొద్దిపాటి మార్పులు చేర్పులు చేశారు.
అయితే, ఇంజన్ పరంగా మాత్రం ఇందులో ఎలాంటి మార్పులు చేయలేదు. కొత్తగా డిజైన్ చేసిన ముందు బంపర్, ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, ఎల్ఈడి లైట్స్, రీడిజైన్డ్ ఫాగ్ ల్యాంప్స్, కొత్త 10-స్పోక్ 16 ఇంచ్ అల్లాయ్ వీల్స్, క్రోమ్ డోర్ హ్యాండిల్స్, రిఫ్రెష్డ్ డ్యూయెల్ టోన్ వెనుక బంపర్, క్రోమ్ టిప్డ్ ఎగ్జాస్ట్ (సైలెన్సర్), ఎల్ఈడి టెయిల్ ల్యాంప్స్ వంటి ఎక్స్టీరియర్ మార్పులను ఇందులో చూడొచ్చు.
ఇక ఇంటీరియర్స్‌లో గమనిస్తే.. ఆల్ బ్లాక్ ఇంటీరియర్ థీమ్‌తో డిజైన్ చేసిన ఈ కారులో లెథర్ సీట్స్, మెటాలిక్ స్కఫ్ ప్లేట్స్, అల్యూమినియం పెడల్స్, ఆర్మ్‌రెస్ట్‌తో కూడిన సెంటర్ కన్సోల్, రియర్ ఏసి వెంట్స్ వంటి మార్పులున్నాయి.
మార్కెట్లో కొత్త 2015 హ్యుందాయ్ ఎలాంట్రా సెడాన్ ధరలు ఇలా ఉన్నాయి:
> ఎలాంట్రా ఎస్ (పెట్రోల్) – రూ.14.13 లక్షలు
> ఎలాంట్రా ఎస్ఎక్స్ (పెట్రోల్) – రూ.15.41 లక్షలు
> ఎలాంట్రా ఎస్ఎక్స్ ఆటోమేటిక్ (పెట్రోల్) – రూ.16.49 లక్షలు
> ఎలాంట్రా బేస్ (డీజిల్) – రూ.14.57 లక్షలు
> ఎలాంట్రా ఎస్ (డీజిల్) – రూ.15.35 లక్షలు
> ఎలాంట్రా ఎస్ఎక్స్ (డీజిల్) – రూ.16.67 లక్షలు
> ఎలాంట్రా ఎస్ఎక్స్ ఆటోమేటిక్ (డీజిల్) – రూ.17.94 లక్షలు
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)