రత్నాల్లో అత్యంత విలువైనది వజ్రం.. మన దేశం నుంచి వెళ్లిపోయిన కోహినూర్ వజ్రం మాటేమో గానీ.. ఈ ఫొటోలో కనిపిస్తున్న దీర్ఘచతరస్రాకారపు వజ్రం విలువ మాత్రం ఏకంగా రూ.150 కోట్ల రూపాయాలు.
ఇది ఆషామాషీ వజ్రం కాదు. 100.2 క్యారెట్ల నాణ్యత కలిగిన ఈ వజ్రాన్ని ప్రస్తుతం వేలానికి ఉంచారు. ఈ అత్యంత అరుదైన వజ్రం దక్షిణాఫ్రికాలో తవ్వకాల్లో బయటపడినట్లు సోత్బీ వేలం సంస్థ వెల్లడించింది.
ఒరిజినల్‌గా ఈ వజ్రం 200 క్యారెట్లు ఉండేదని అయితే పాలిష్, కటింగ్ తదితర ప్రక్రియల తర్వాత ఇది 100 క్యారెట్లకు వచ్చిందని సదరు వేలం కంపెనీ తెలిపింది. మంగళవారం దీన్ని వేలానికి పెట్టనుండగా రూ.119 కోట్లనుంచి రూ150 కోట్లకు ఇది అమ్ముడుపోవచ్చని అంచనా వేస్తున్నారు. గడచిన 25 ఏళ్లలో ఇప్పటి వరకూ కేవలం ఐదు 100 క్యారెట్ల వజ్రాలను మాత్రమే వేలం వేశారట.