ఈ ఫొటోలో అచ్చు గుద్దినట్లుగా ఒకేలా కనిపిస్తున్న అక్కాచెల్లెల్ల పేర్లు అన్నా, లూసీ. వీరిద్దరూ కవలపిల్లలు. వీరిద్దరిని పక్క పక్కనే నిలుచోబెట్టి చూస్తే, ఏ మాత్రం తేడా కనిపించదు. వీరిలో ఎవరు అన్నా, ఎవరు లూసీని అని కనుక్కోవటం చాలా కష్టం.
అయితే, వీరిద్దరూ పుట్టుకుతోనే ఇలా సేమ్ టూ సేమ్‌గా లేరు. పెరిగి పెద్దయ్యాక ప్లాస్టిక్ సర్జరీ చేయించుకొని, ఇదిగో ఇలా జెరాక్స్ కాపీల్లా మారారు. ఈ ప్లాస్టిక్ సర్జరీల కోసం వీరిద్దరూ సుమారు రెండున్నర లక్షల డాలర్లను ఖర్చు చేశారు.
ఆస్ట్రేలియాకి చెందిన ఈ అక్కచెల్లెల్లు ప్రపంచంలో కెల్లా అత్యంత దగ్గర పోలికలు కలిగిన కవలలు (మోస్ట్ ఐడెంటికల్ ట్విన్స్)గా రికార్డు కూడా సాధించారు. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే.. శరీర పోలికలను షేర్ చేసుకున్నట్లుగానే వీరిద్దరూ బాయ్‌ఫ్రెండ్‌ని కూడా షేర్ చేసుకున్నారట. ఆ బాయ్‌ఫ్రెండ్ ఎవడో కానీ ఒకే టికెట్‌పై రెండు సినిమాలు చూసేస్తున్నాడు.