ఈ ఫోటోలో కనిపిస్తున్న రైలు ఆషామాషీ రైలు కాదు. ఇది గంటకు గరిష్టంగా 603 కిలోమీటర్ల దూరంతో ప్రయాణించగలదు. బుల్లెట్ ట్రైన్లను సృష్టించడంలో ప్రపంచం ప్రసిద్ధి చెందిన జపాన్ తాజాగా ఈ రైలును సృష్టించింది. దీని పేరు మాగ్లెవ్.
మాగ్నటెకి ఎలివేషన్ టెక్నాలజీతో ఈ రైలును తయారు చేశారు, ఫలితంగా రైలు పట్టాలను ఆనుకోకుండా (పట్టాలకు, రైలుకు మధ్య 10 సెంటీమీటర్ల ఖాళీ ఉంటుంది) పరుగులు తీస్తుంది. అంటే, ఇది గాలిలోనే పరుగెడుతుందన్నమాట!
మాగ్లెవ్ రైలులో ఏడు బోగీలుంటాయి. ప్రస్తుతం ప్రపంచంలో కెల్లా అత్యంత వేగంగా పరుగులు తీసే రైలు కూడా ఇదే. ఇటీవలే ఈ రైలు కోసం పబ్లిక్ ట్రైల్ రన్ కూడా నిర్వహించారు. త్వరలోనే ఇది జపాన్ వాసులకు అందుబాటులోకి రానుంది.