స్వీడన్ కార్ కంపెనీ ‘వోల్వో’ గడచిన జూన్ 2013లో భారత మార్కెట్లో విడుదల చేసిన ‘వోల్వో వి40 క్రాస్ కంట్రీ’ (Volvo V40 Cross Country) క్రాసోవర్ మోడల్లో కంపెనీ తాజాగా పెట్రోల్ వెర్షన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. భారత మార్కెట్లో ఈ పెట్రోల్ మోడల్ ధరను రూ.27 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు.
ఇప్పటి వరకూ డీజిల్ వెర్షన్లో మాత్రమే లభ్యమవుతూ వచ్చిన వోల్వో వి40 క్రాస్ కంట్రీ ఇకపై పెట్రోల్ వెర్షన్లో కూడా లభ్యం కానుంది. ఈ పెట్రోల్ వెర్షన్లో 1.6 లీటర్, 4-సిలిండర్, డైరెక్ట్ ఇంజెక్షన్, టర్బోచార్జ్డ్ ఇంజన్‌ను ఉపయోగించారు.
యూరో5 కాలుష్య నిబంధనలను పాటించే ఈ అధునాతన ఇంజన్ గరిష్టంగా 182.5 పిఎస్‌ల శక్తిని, 240 ఎన్ఎమ్ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. ఇది కేవలం 8.2 సెకండ్ల వ్యవధిలోనే 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.