జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ ఆడి ఇండియా, దేశీయ విపణిలో తమ కొత్త తరం ఆడి టిటి కూపే మోడల్‌ను విడుదల చేసింది. భారత్‌లో ఈ కొత్త 2015 ఆడి టిటి కారు ధర రూ.60.34 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది. మునపటి తరం ఆడి టిటితో పోల్చుకుంటే ఈ కొత్త తరం మోడల్ దాదాపు 50 కేజీల తక్కువ బరువును కలిగి ఉంటుంది.
ఆడి స్పెషల్ ఫ్రేమ్ టెక్నాలజీ మరియు ఫోక్స్‌వ్యాగన్ ఎమ్‌క్యూబి ప్లాట్‌ఫామ్‌లను ఉపయోగించడం ద్వారా ఇది సాధ్యమైందని కంపెనీ తెలిపింది. మ్యాట్రిక్ ఎల్ఈడి లైటింగ్ సిస్టమ్, పెద్ద ఎయిర్ డక్ట్స్, ట్రాపేజోయిడల్ గ్రిల్, రివైజ్డ్ బంపర్స్, ఎల్ఈడి టెయిల్ ల్యాంప్స్ వంటి ఫీచర్లతో డిజైన్ చేసిన ఈ మూడవ తరం ఆడి టిటి మునుపటి మోడళ్ల కన్నా అందంగా ఉంటుంది.
కొత్త 2015 ఆడి టిటి కూపే మోడల్లో పవర్ఫుల్ 2.0 లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 227 బిహెచ్‌పిల శక్తిని, 370 ఎన్ఎమ్ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది.
ఈ ఇంజన్ 6-స్పీడ్ డ్యూయెల్ క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో కనెక్ట్ చేయబడి ఉంటుంది. ఇది కేవలం 5.3 సెకండ్ల వ్యవధిలోనే 0-100 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్ట వేగాన్ని గంటకు 250 కిలోమీటర్లకు యాంత్రికంగా పరిమితం చేశారు.