పసితనంలో బుడిబుడి అడుగులు
తబడినప్పుడు తగిలిన ఎదురుదెబ్బ..
బాల్యంలో పాఠశాలకు వడివడిగా
పరుగులు తీసినప్పుడు తగిలిన ఎదురుదెబ్బ..
యవ్వనంలో తెలిసి తెలియక చేసిన
పైత్యపు పనుల వలన తగిలిన ఎదురుదెబ్బ..
ఉద్యోగంలో ఉక్రోషానికి పోగా
తగిలిన ఎదురుదెబ్బ..
వైవాహిక జీవితంలో చిన్నపాటి
గొడవల వల్ల తగిలిన ఎదురుదెబ్బ..
ముసలితనంలో ఎదిగిన సంతానం
వలన తగిలిన ఎదురుదెబ్బ..
ఈ జీవితంలో ఎదురుదెబ్బ తినని వాడెవడు.. ఈరోజు నేను.. రేపు నువ్వు..
—- రవి శంకర్