నిర్ధిష్ట పరిధికి మించి ఆస్తులు, నగలు కొనుగోలు చేయడానికి అలాగే పలు ఆర్థిక లావాదేవీలు నిర్వహించడానికి పాన్ కార్డు (శాశ్వత ఖాతా సంఖ్య లేదా పర్మినెంట్ అకౌండ్ నెంబర్) తప్పనిసరిగా ఉండాలి. ఈ నేపథ్యంలో, పాన్ కార్డు జారీని సులభతరం చేస్తూ కేంద్రం ప్రత్యేక చర్యలు తీసుకోనుంది.
ఇకపై పాన్ కార్డును కేవలం 48 గంటల్లోనే జారీ చేసేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. పాన్ కార్డు కోసం అవసరమైన గుర్తింపు (ఐడి), చిరునామా (అడ్రస్) ప్రూఫ్లను తప్పులు లేకుండా సమర్పించినట్లయితే, 48 గంటల్లో పాన్ కార్డు తయారయ్యేలా కేంద్రం ఒక ఆన్లైన్ సౌకర్యాన్ని ప్రారంభించనుంది. త్వరలోనే ఈ సేవలు అందుబాటులోకి వచ్చే ఆస్కారం ఉంది.