జామపండు తింటే జలుబు చేస్తుందని, జీర్ణం కాదని పెద్దలు వారిస్తూ ఉంటారు. వాస్తవానికి జామపండులో అనేక పోషక విలువలు, ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. జామపండులో క్యాలరీలు, కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటాయి.
జామపండులో ఎక్కువ పీచు పదార్థం (పైబర్) ఉంటుంది. ఇది మలబద్ద కాన్ని తగ్గిస్తుంది. ఇందులో ఎ, బి, సి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఈ పండు తినడం ద్వారా శరీరానికి కావాల్సిన యాంటిఆక్సిడెంట్స్ లభిస్తాయి.
కంటి సమస్యలు, కొన్ని రకాల క్యాన్సర్లు రాకుండా కూడా జామపండు కాపాడుతుంది. స్త్రీలలో రుతుచక్ర సమస్యలు, బ్రెస్ట్ క్యాన్సర్, పురుషుల్లో ప్రోస్టేట్ క్యాన్సర్లు రాకుండా నివారించడంలో జామపండు సహకరిస్తుంది.
జామపండులో విటమిన్ ఎ, ఫ్లేవనాయిడ్స్, బీటాకెరోటిన్, లైకోపిన్ ఉండడం వల్ల ఇది ఉపరితిత్తులకు, చర్మానికి, కంటికి చాలా మేలు చేస్తుంది. అతినీలలోహిత కిరణాల (ఆల్ట్రావైలెట్ రేస్) నుండి వచ్చే కొన్ని క్యాన్సర్ కారకాలను జామపండు ఉండే లైకోపిన్ అడ్డుకుంటుంది.
జామపండులోని ఉండే పొటాషియం గుండె జబ్బులు, బీపి పెరగకుండా చేస్తాయి. అంతేకాకుండా, జమకాయలో బి కాంప్లెక్స్ విటమిన్స్ బి6, బి9, ఇ, కె విటమిన్లు ఉంటాయి. ఎర్ర రక్త కణాల ఉత్పత్తిలో జామపండు ఎంతగానో సహాయపడుతుంది.
మరి మనకి ఇన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలను కలిగించే జామపండును మీరు కూడా నిత్యం తింటున్నారా..?