చాలా మందికి మెంతులు అంటే పడదు, చేదుగా ఉంటాయని వాటిని తినడం మానేస్తారు. వాస్తవానికి మెంతులు రుచిలో చేదుగా ఉన్నప్పటికీ మంచి ఔషధగుణాలను కలిగి ఉంటాయి. మెంతులను తరచూ ఆహారంలో భాగం తీసుకోవటం వలన మంచి ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని వైద్యులు చెబుతున్నారు.
మెంతులలో అధిక మోతాదులో మినరల్స్, విటమిన్లు, ఫైటోన్యూట్రియంట్స్ లభిస్తాయి. వందగ్రాముల మెంతుల్లో 323 కేలరీలు ఉంటాయి. శరీరంలో త్వరగా కరిగేపోయే పీచు దీనిలో ఎక్కువగా లభిస్తుంది. ఇందులో ఉండే కాంపౌడ్స్ అయిన మ్యుకిలేజ్, టానిన్, హెమీసెల్యులోజ్, పెక్టిన్ వంటివి రక్తంలోని ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ స్థాయుల్ని తగ్గిస్తాయి.
శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపించి వూపిరితిత్తుల క్యాన్సర్ రాకుండా కాపాడటంలో కూడా మెంతులు చక్కగా సహకరిస్తాయి. ఇంకా ఇందులో లభించే నాన్స్టార్చ్ పోలీశాచిరైడ్స్ జీర్ణప్రక్రియ సక్రమంగా జరిగేలా చూడటమే కాకుండా మలబద్ధకాన్ని నివారించడంలో ఉపయోగపడుతాయి. విరేచనాలు అవుతున్నప్పుడు మెంతులు మింగితే, విరేచనాలు తగ్గుతాయి.