ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న అనేక రకాల స్మార్ట్ఫోన్లలో ఫ్లాష్‌లైట్ ఆప్షన్ ఉంటుంది. ఈ ఫ్లాష్‌లైట్ ఫొటోలు తీసేప్పుడే కాకుండా, చీకటిలో టార్చ్లైట్గా మాదిరిగా కూడా పనికొస్తుంది.
అయితే, ఈ ఫ్లాష్‌లైట్‌ని మరో విధంగా కూడా వాడుకోవచ్చు. మీరు చీకట్లో దూరంగా ఎక్కడైనా ఉన్నప్పుడు ఫ్లాష్‌లైట్‌ని వెలుగుతూ ఆరుతూ (బ్లింక్) ఉండేలా ఇతరులకు సంకేతాలు ఇవ్వొచ్చు. అంతేకాదు… ఇలా బ్లింక్ కొట్టే సమయంలో శబ్దం వచ్చేలా కూడా చేయవచ్చు.
ఇలా కావాలంటే.. ముందుగా మీ స్మార్ట్‌ఫోన్‌లో Super-Bright LED Flashlight అనే అప్లికేషన్‌ను ఇన్స్టాల్ చేసుకోవాలి. ఈ యాప్‌ని ఇన్స్టాల్ చేసిన తర్వాత హోం స్క్రీన్‌లోని బటన్ నొక్కి ఫ్లాష్‌లైట్‌ని ఆన్ చేయవచ్చు. లైట్‌ని బ్లింక్ అయ్యేలా చేసేందుకు Strobe బటన్న్ని జరిపితే చాలు. వేగంగా లైట్ బ్లింక్ అవుతుంది. బ్లింక్ అయ్యే వేగాన్ని పెంచడం, తగ్గించడం చేయవచ్చు.
ఈ అప్లికేషన్‌ను డౌన్లోడ్ చేసుకోవటం కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.
https://play.google.com/store/apps/details?id=com.surpax.ledflashlight.panel