టాటా మోటార్స్ అందిస్తున్న బడ్జెట్ కారు టాటా నానోలో ఇప్పుడు తాజాగా కంపెనీ ఓ సరికొత్త వేరియంట్‌ను ఆవిష్కరించింది. ‘జెనెక్స్ నానో ఈజీ షిప్ట్’ పేరిట టాటా మోటార్స్ ఈ కొత్త 2015 నానో కారును ఆవిష్కరించింది.
ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఈ బడ్జెట్ టాటా నానో కారు పాపులర్ ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ (ఏఎమ్‌టి)తో లభ్యం కానుంది. ఈ టెక్నాలజీనే కంపెనీ ఈజీ షిఫ్ట్‌గా వ్యవహరిస్తోంది.
టాటా మోటార్స్ ఇప్పటికే తమ జెస్ట్ కాంపాక్ట్ సెడాన్‌లో ఏఎమ్‌టి టెక్నాలజీని అందిస్తోంది. కాగా.. టాటా నుంచి ఈ టెక్నాలజీతో వస్తున్న రెండవ కారు టాటా నానో కావటం విశేషం.
ఈ కొత్త జెనెక్స్ నానో కారులో కాస్మోటిక్ అప్‌గ్రేడ్స్‌తో పాటుగా ఫీచర్ అప్‌గ్రేడ్స్ కూడా ఉన్నాయి. దీని ఫ్యూయెల్ ట్యాంక్ సామర్థ్యాన్ని కూడా 15 లీటర్ల నుంచి 24 లీటర్లకు పెంచారు. అలాగే వెనుక వైపు ఓపెనబల్ బూట్ డోర్ కూడా ఆఫర్ చేయనున్నారు.
మరికొద్ది రోజుల్లోనే ఈ కొత్త 2015 టాటా నానో బుకింగ్‌లు ప్రారంభం కానున్నాయి. అయితే, ఇది కస్టమర్లకు మాత్రం వచ్చే నెలలోనే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.