చేపలు తినేవారికి ఓ గుడ్ న్యూస్. చేప సంబంధ ఆహారపదార్థాలను తినేవారు గుండెపోటు బారిన పడరని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. అంతేకాకుండా.. చేపలు తినడం వలన కళ్ళకు సంబంధ వ్యాధులను రావని వైద్యులు అంటున్నారు.
చేపలు శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహకరిస్తాయి. చేపలలో కొవ్వు శాతం బాగా తక్కువగా ఉండటన వలన ఇవి ఇతర మాంసాహార సంబంధ ఆహార పదార్థాల మాదిరిగా శరీరానికి ఎలాంటి హాని చేయవు. ఎముకల్లో బలాన్ని చేకూర్చడానికి, శరీరంలో రక్తాన్ని వృద్ధి చేయడానికి కూడా చేపలు సహకరిస్తాయి.
మేధస్సును పెంపొందించడంలో కూడా చేపలు మనకు ఎంతగానో సహకరిస్తాయి. చేపలలో ఉండే ఓమేగా-3 ఫాటీ యాసిడ్స్ మెదడులోని కణాలను ఉత్తేజితం చేస్తాయి. ఏ ఇతర ఆహారం పదార్థాంలోనూ ఈ స్థాయిలో ఒమేగా-3 ఫాటీ యాసిడ్స్ ఉండవని న్యూట్రీషన్స్ చెబుతున్నారు. మరి.. మీ దిల్ని ఖుషీగా ఉంచుకోవడానికి మీరు కూడా చేపల్ని తింటారా..?