చైనీస్ స్మార్ట్‌ఫోన్ కంపెనీ షియోమీ గురువారం నాడు తమ సరికొత్త ఎమ్ఐ 4ఐ స్మార్ట్‌ఫోన్‌తో పాటుగా ఎమ్ఐ బ్యాండ్ అనే ఫిట్నెస్ ట్రాకర్‌ను కూడా మార్కెట్లో విడుదల చేసింది. కేవలం రూ.999 లకే ఈ షియోమీ ఎమ్ఐ బ్యాండ్ లభిస్తుంది.
ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న అత్యంత చవకైన ఫిట్నెస్ ట్రాకర్ బ్యాండ్ ఇదే. ఎమ్ఐ బ్యాండ్ ఎప్పటికప్పుడు మీ ఫిట్నెస్ను పర్యవేక్షిస్తూ, మీరు నిద్రించిన సమయాన్ని కూడా ట్రాక్ చేస్తూ ఉంటుంది. ఇది బ్లూటూత్ చిప్, యాక్సిలరోమీటర్ ద్వారా పనిచేస్తుంది.
ఎమ్ఐ బ్యాండ్‌ను ఒక్కసారి చార్జ్ చేస్తే 30 రోజుల వరకూ పనిచేస్తూనే ఉంటుందని షియోమీ తెలిపింది. పాస్వర్డ్ సాయం లేకుండా మీ స్మార్ట్‌ఫోన్‌ను అన్‌లాక్ చేసుకునేందుకు మరియు అలారమ్ క్లాక్ మాదిరిగా కూడా ఈ ఎమ్ఐ బ్యాండ్ ఉపయోగపడుతుంది.