మనం కూరల్లో వెల్లుల్లి (గార్లిక్)ని వాడుతుంటాం. కొందరికి వెల్లుల్లి అంటే ఇష్టం, మరికొందరికి అయిష్టం. వెల్లుల్లి కూర రుచిని పెంచడంలోనే కాకుండా మన శరీరానికి కావల్సిన బోలెడు ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందజేస్తుంది. అవేంటో తెలుసుకుందాం రండి.
వెల్లుల్లిలో ఉండే ప్రత్యేక ఔషద గుణాలు మనల్ని జలుబు, ఫ్లూ, జ్వరం, అధిక రక్త పోటు, అధిక కొవ్వు పదార్థాల స్థాయిలు, విస్తారిత ప్రోస్టేట్, మధుమేహం, ఆస్టియో ఆర్థరైటిస్, ప్రయాణాలలో కలిగే విరేచనాలు, ప్రీఎక్లంప్సియా, కరోనరీ ఆర్టేరీ డిసీజెస్, గుండెపోటు, మరియు ధమనులు గట్టిపడటం వంటి పలు సమస్యలను నుండి కాపాడుతుంది.
అంతేకాకుండా, వెల్లుల్లి పెద్దప్రేగు క్యాన్సర్, పురీషనాళ, పొట్ట, రొమ్ము, ప్రోస్టేట్ క్యాన్సర్ మరియు ఊపిరితిత్తుల క్యాన్సర్లను నిరోధించటంలో కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టే, పలు ఆయుర్వేద ఔషదాల తయారీలలో కూడా వెల్లుల్లిని ఉపయోగిస్తారు.
ప్రతిరోజూ రెండు వెల్లుల్లి రెబ్బలను తీసుకుంటే… అది శరీరానికి సంజీవినిలాగా పనిచేస్తుంది. ప్రతిరోజూ వెల్లుల్లి తింటే జిమ్‌కి వెళ్లి కొవ్వు కరిగించుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. వెల్లుల్లిలో ఉండే సహజమైన సల్ఫర్ జీర్ణాశయంలోని ఎంజైములను ఉత్తేజపరచి, శరీరంలోని అనవసరమైన కొవ్వును కరిగించడంలో సహకరిస్తుంది.
ప్రొద్దున్నేఖాళీ కడుపుతో వెల్లుల్లిని తినటం వలన, ఇది సహజ యాంటీ బయాటిక్‌గా పని చేస్తుందని వైద్యులు చెబుతున్నారు. వెల్లుల్లిలోని యాంటీ బయాటిక్ గుణాలు, జీర్ణాశయంలోని బ్యాయాక్టీరియాలను నాశనం చేయటంలో సహకరిస్తాయి.
ఆకలిని మెరుగు పరచడం, నాడి వ్యవస్థ చురుగ్గా పనిచేయించడం, చర్మంలోని విషపూరితమైన పదార్ధాలను బయటకు పంపించడం, అధిక రక్త పోటును తగ్గించడం, రక్త ప్రసరణ మెరుగుపరచడం, గుండె సంబంధిత వ్యాధులను నివారించడం, కాలేయ మరియు మూత్రాశయ పనితీరులను మెరుగుపరుచడంలో కూడా వెల్లుల్లి కీలక పాత్ర పోషిస్తుంది.
మరి మన శరీరానికి ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు చేకూర్చే వెల్లుల్లిని మీరు కూడా రోజు తింటున్నారా..?