ఫ్రెంచ్ కార్ కంపెనీ రెనో ఇండియా, ఈనెల ఆరంభంలో దేశీయ విపణిలో విడుదల చేసిన తమ సరికొత్త బహుళ ప్రయోజన వాహనం (మల్టీ పర్పస్ వెహికల్) ‘రెనో లాజీ’ (Renault Lodgy)ని తాజాగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలలో కూడా విడుదల చేశారు.
రాష్ట్ర విపణిలో రెనో లాజీ ఎమ్పివి ధరలు రూ.8.31 లక్షల నుంచి రూ.11.95 లక్షల మధ్యలో ఉన్నాయి. ఈ ఎమ్పివిలో పాపులర్ 1.5 లీటర్ కె9కె డీజిల్ ఇంజన్ను ఉపయోగించారు. ఈ ఇంజన్ 85 పిఎస్, 110 పిఎస్ పవర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇది 6-స్పీడ్ మ్యాన్యువల్ (110 పిఎస్), 5-స్పీడ్ మ్యాన్యువల్ (85 పిఎస్) గేర్బాక్స్ ఆప్షన్లతో లభిస్తుంది.
రెనో లాజీ 7-సీటర్, 8-సీటర్ కాన్ఫిగరేషన్లలో లభిస్తుంది. ఇందులో హైట్ అడ్జస్టబల్ డ్రైవర్ సీట్, టచ్ స్క్రీన్ మీడియా నావిగేషన్ విత్ బ్లూటూత్, యూఎస్బి అండ్ ఆక్స్-ఇన్ సపోర్ట్, మల్టీ-ఫంక్షన్ స్టీరింగ్ వీల్, ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్), ఈబిడి (ఎలక్ట్రానిక్ బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్), బ్రేక్ అసిస్ట్, ఫ్రంట్ డ్రైవర్ అండ్ ప్యాసింజర్ ఎయిర్బ్యాగ్స్ వంటి కీలక ఫీచర్లున్నాయి.
రాష్ట్ర విపణిలో రెనో లాజీ ఎమ్పివి ధరలు ఇలా ఉన్నాయి:
-> రెనో లాజీ 85 పిఎస్ – రూ.8,31,000
-> రెనో లాజీ 85 పిఎస్ ఆర్ఎక్స్ఈ – రూ.9,11,000
-> రెనో లాజీ 85 పిఎస్ ఆర్ఎక్స్ఎల్ – రూ.9,72,000
-> రెనో లాజీ 110 పిఎస్ ఆర్ఎక్స్ఎల్ – రూ.10,23,000
-> రెనో లాజీ 85 పిఎస్ ఆర్ఎక్స్జెడ్ – రూ.11,03,000
-> రెనో లాజీ 110 పిఎస్ ఆర్ఎక్స్జెడ్ (7 సీటర్) – రూ.11,95,000
-> రెనో లాజీ 110 పిఎస్ ఆర్ఎక్స్జెడ్ – రూ.11,65,000
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్)