ప్రముఖ సోషల్ నెట్వర్కింగ్ వెబ్సైట్ ఫేస్బుక్ (Facebook) కొత్తగా ‘హలో’ (Hello) అనే ఓ వాయిస్ కాలింగ్ అప్లికేషన్‌ను ప్రారంభించింది. ఫేస్బుక్ హలో పేరుతో అందుబాటులోకి వచ్చిన ఈ అప్లికేషన్లో ట్రూకాలర్ (True Caller) అప్లికేషన్ తరహా ఫీచర్ కూడా ఉంది.
ఈ యాప్ ఫేస్‌బుక్‌కు అనుసంధానమై ఉండటం వల్ల తెలియని వ్యక్తులు ఎవైరైనా ఫోన్ చేసినా వారి నంబర్‌ను సులువుగా గుర్తు పట్టే అవకాశం ఉంటుంది. స్పామ్ నెంబర్స్ ఏవైనా ఉంటే ఆ నంబర్ల నుంచి తరచూ ఫోన్ కాల్స్ రాకుండా ఉండేందుకు ఆయా కాల్స్‌ను బ్లాక్ చేయవచ్చు
హలో అప్లికేషన్ సాయంతో వ్యక్తులు, ప్రదేశాలను సైతం శోధించవచ్చు. ప్రస్తుతం హలో అప్లికేషన్‌ను యునైటెడ్ స్టేట్స్, బ్రెజిల్, నైజీరియాలో అందుబాటులోకి తెచ్చారు. త్వరలోనే ఇతర దేశాల్లో కూడా అందుబాటులోకి రానుంది. కాగా.. ప్రస్తుతానికి ఇది ఆండ్రాయిడ్ ఆధారిత ఫోన్లను మాత్రమే సపోర్ట్ చేస్తుంది. యాపిల్ ఫోన్ల కోసం కూడా ఇది అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.