నేపాల్ పశుపతినాథ్ ఆలయ విశేషాలు

పశుపతినాథ్ దేవాలయం నేపాల్ దేశ రాజధాని ఖాట్మండు నగరం ఈశాన్య దిక్కు పొలిమేర్లలో బాగమతి నది ఒడ్డున ఉంది. పశుపతి (శివుడు) ప్రధాన దైవంగా ఉన్న ఈ దేవాలయం ప్రపంచంలోనే అతి పవిత్రమైన శైవ దేవాలయంగా భావిస్తారు. భారతదేశం, నేపాల్ నుండి భక్తులు ఈ దేవాలయాన్ని సందర్శిస్తారు. మహాశివరాత్రి రోజు అత్యంత పర్వదినం, వేల సంఖ్యలో భక్తులు పశుపతినినాథుని దర్శిస్తారు.

ఈ దేవాలయంలోకి హిందువులు కాని వారిని అనుమతించరు. ఇక్కడి దేవాలయంలో ఉన్న మూల విరాట్టుని నలుగురు అర్చకులు మాత్రమే స్పృశించే అధికారం ఉంది. శంకరాచార్యులు ప్రారంభించిన ఆలయ సాంప్రదాయం ప్రకారం ఇక్కడి అర్చకులు దక్షిణ భారతదేశం నుండి నియమించబడతారు. శంకరాచార్యులు ఇక్కడ మానవ మరియు జంతు బలిని నిషేధించారు.

దక్షిణ భారతదేశం నుండి అర్చకులు ఇక్కడ పూజలు నిర్వహించడానికి ప్రధాన కారణం నేపాల్ రాజు మరణించినప్పుడు నేపాల్ దేశము సంతాప సముద్రములో ఉంటుంది. నేపాల్ ప్రజలకు పశుపతినాథ్ స్వామి నిత్యకైంకర్యాలు చేసే అవకాశం ఉండదు, పశుపతినాథ్‌‌కి నిత్యకైంకర్యాలు నిరంతంగా కొనసాగాలనే కారణం చేత భారతదేశార్చకులు ఇక్కడ అర్చకత్వం నిర్వహిస్తుంటారు.

Temple
గోవు ఇతిహాసం
ఈ ఇతిహాసం ప్రకారం శివుడు ఒకప్పుడు జింక వేషం ధరించి బాగమతి నది ఒడ్డున విహరిస్తుండగా దేవతలు, శివుడు తన స్వరూపంలో చూడలని కోరికతో దేవతలు శివుడు జింక అవతారంలో ఉన్నప్పుడు అతని కొమ్ముని పట్టుకొన్నారు. అప్పుడు ఆ కొమ్ము విరిగి పోయి ఇక్కడ ఖననం చేయబడింది.శతాబ్ధాల తరువాత ఒకనాడు ఒక ఆవు ఇక్కడి ప్రాంతానికి వచ్చి ఈ లింగం పడిన ప్రాంతంలో పాలు కురిపిస్తుంటే పశువుల కాపరి అక్కడి ప్రదేశాన్ని త్రవ్వగా శివ లింగం బయట పడింది.

మరో ఇతిహాసం
ఇంకో ఇతిహాసం ప్రకారం నేపాల మహత్యం మరియు హిమవత్‌ఖండం ప్రకారం ఒకరోజు శివుడు కాశి నుండి భాగమతి నది ఒడ్డున ఉన్న మృగస్థలి అనే ప్రదేశంలో పార్వతి సమేతంగా వచ్చి జింక అవతారంతో నిద్రుస్తుండగా దేవతలు శివుడిని కాశి తిరిగి తీసుకొని పోవడానికి జింకని లాగినప్పుడు జింక కొమ్ము విరిగి నాలుగు ముక్కలుగా పడింది. ఈ నాలుగు ఖండాలుగా పడినదే ఇప్పుడు చతుర్ముఖ లింగం గా ఉన్నదని ఇతిహాసం చెబుతారు.

ఆలయ చరిత్ర
ఆలయ నిర్మాణ కాలం గురించి సరైన అధారాలు లేవు. గోపాలరాజ్ వంశవలి అనే చారిత్రాక పత్రిక ప్రకారం లించచ్చవి రాజు శుశూపదేవ క్రీ.శ.753 సంవత్సరంలో ఈ ఆలయనిర్మాణం జరిపాడని, పదకొండవ జయదేవ పశుపతినాథ్ దేవాలయంలో వేయించిన శిలాశాసనం ద్వారా తెలుస్తొంది.. తరువాతి కాలంలో 1416 సంవత్సరం రాజా జ్యోతి మల్ల ఈ దేవాలయానికి పునరుద్ధరణ పనులు జరిపించాడని,1697 సంవత్సరంలో రాజా భూపేంద్ర ఈ దేవాలయానికి పునఃనిర్మించాడని తెలుస్తోంది.

ఆలయ నిర్మాణ శైలి
దేవాలయం పగోడ వలె ఉంటుంది. రెండు పైకప్పులు రాగి మరియు బంగారంతో తాపడం చేయబడి ఉంటాయి.నాలుగు ప్రధాన ద్వారాలకు (తలుపులకు) వెండి తాపడం చేయబడి ఉంటుంది.పశ్చిమ ద్వారం వద్ద పెద్ద నంది బంగారు కవచంతో ఉంటుంది. ఈ నంది విగ్రహం 6 అడుగుల ఎత్తు, 6 అడుగుల చుట్టుకొలత కలిగి ఉన్నది. ఇక్కడ పూజలు చేసే పూజారులను భట్ట అని , ప్రధాన అర్చకుడిని మూల భట్ట లేదా రావల్ అని పిలుస్తారు. ఇక్కడి ప్రధాన అర్చకుడు నేపాల్ రాజుకు మాత్రమే జవాబుదారీ.దీనిని బట్టి ఈ ఆలయం ప్రాముఖ్యత మరియు ప్రధాన అర్చకుల అధికారాలు విఫులం అవుతాయి. మూల భట్ట(ప్రధాన అర్చకుడు) అప్పుడప్పుడు ఆలయ విశేషాలు నేపాల్ రాజుకి తెలియజేస్తుంటాడు. ఈ దేవాలయం తూర్పున వాసికినాథ్ దేవాలయం ఉన్నది.
Pashupatinath Temple

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s