నేపాల్ భూకంపం.. చెక్కు చెదరని పశుపతినాథ్ ఆలయం

పుడమితల్లికి ఆగ్రహం వచ్చింది. నేపాల్ వేలాది మంది అమాయకులను పొట్టనపెట్టుకుంది. గతవారం నేపాల్‌లో సంభవించిన భూకంపం ఆ దేశానికి తీరని నష్టాన్ని తెచ్చిపెట్టింది. రిక్టర్ స్కేలుపై 7.9 తీవ్రతగా నమోదైన ఈ భూకంపం వలన నేపాల్ రాజధాని ఖాట్మాండులో ఉన్న భవనాలు అన్నీ కూడా పేకమేడల్లా నేలకొరిగాయి.

ఈ నేపాల్ భూకంపంలో అనేక మంది ప్రాణాలు కోల్పోగా, వేలాది మంది క్షతగాత్రులయ్యారు. కాగా.. ఈ భూకంపంలో ఎన్నో కట్టడాలు, చారిత్రాత్మక భవంతులు నేలమట్టమైనా అత్యంత పురాతనమైన పశుపతినాథ్ ఆలయానికి మాత్రం ఎలాంటి నష్టం జరగలేదు.

మూడవ దశాబ్దానికి చెందిన పశుపతినాథ్ ఆలయం వద్ద తలదాచుకున్న ఎంతో మంది భక్తులు ఆ రోజు ప్రాణాపాయం నుండి తప్పించుకున్నారు. ఆ శివుడి దయవలనే తమ ప్రాణాలు దక్కాయని ఈ ప్రమాదం నుంచి బయటపడిన వారు చెబుతున్నారు.

పశుపతినాథ్ ఆలయానికి వెలుపల వైపు ఉన్న గోడలు కొంచెం బీటలు వారాయి, కానీ ప్రధాన ఆలయం మాత్రం అలానే ఉంది. ప్రమాదం తర్వాత ఈ ఆలయంలో ఎప్పటి మాదిరిగా పూజలు జరిగాయి. ఆ కైలాసనాధుని దర్శించుకోవడానికి ఎప్పటిలాగే భక్తులు వచ్చారు.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s