టీవీఎస్ మోటార్ కంపెనీ అందిస్తున్న 125సీసీ బైక్ ఫినిక్స్‌లో కంపెనీ తాజాగా ఓ అప్డేటెడ్ వెర్షన్‌ను మార్కెట్లో విడుదల చేసింది. ఈ కొత్త 2015 టీవీఎస్ ఫినిక్స్ 125 బైక్‌లో కాస్మోటిక్ అప్‌గ్రేడ్స్‌తో పాటుగా ఫీచర్ అప్‌గ్రేడ్స్ కూడా ఉన్నాయి.
ఈ కొత్త బైక్‌లో కొత్త విజర్, 3డి ఫినిక్స్ లోగోతో కూడిన ఫ్యూయెల్ ట్యాంక్, కొత్త బాడీ గ్రాఫిక్స్, బాడీ కలర్డ్ గ్రాబ్ రెయుల్ వంటి మార్పులున్నాయి. ఇంకా.. ఎల్ఈడి పైలట్ ల్యాంప్స్, ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, అపాచే స్టయిల్ రోటో-పెటల్ ఫ్రంట్ డిస్క్ బ్రేక్, ట్యూబ్‌లైస్ టైర్స్, వెహికల్ లొకేటర్ కీ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.
త్త టీవీఎస్ ఫినిక్స్ 125లో ఇంజన్ పరంగా ఎలాంటి మార్పులు లేవు. ఇందులోలో ఉపయోగించిన 125సీసీ ఇంజన్ గరిష్టంగా 11 పిస్‌ల శక్తిని, 10 ఎన్ఎమ్ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 4-స్పీడ్ ట్రాన్సిమిషన్‌తో లభించే ఈ బైక్ లీటర్ పెట్రోల్‌కు 67 కి.మీ. మైలేజీని (స్టాండర్డ్ రైడింగ్ కండిషన్స్ ప్రకారం) ఆఫర్ చేస్తుందని కంపెనీ పేర్కొంది.
టీవీఎస్ ఫినిక్స్ డ్రమ్ బ్రేక్స్ వెర్షన్ ధర రూ.51,990 మరియు డిస్క్ బ్రేక్ వెర్షన్ ధర రూ.55,899 (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉన్నాయి. టీవీఎస్ ఫినిక్స్ ఈ సెగ్మెంట్లో హోండా షైన్, హీరో గ్లామర్, బజాజ్ డిస్కవర్ వంటి 125సీసీ బైక్‌లకు పోటీగా నిలుస్తుంది.