గూగుల్ చీప్ ఫోన్ నెట్‌వర్క్ ‘ప్రాజెక్ట్ ఫై’ షురూ…

అంతర్జాల దిగ్గజం గూగుల్ ఇప్పటికే ఆండ్రాయిడ్ ప్లే స్టోర్‌తో మొబైల్ ప్రియులను ఆకర్షిస్తున్న సంగతి తెలిసినదే. కాగా.. తాజా అప్‌డేట్ ప్రకారం, గూగుల్ ఇప్పుడు ఎయిర్‌టెల్, ఐడియాల మాదిరిగా తమ స్వంత నెట్‌వర్క్‌ను ప్రారంభించింది.

‘ప్రాజెక్టు ఫై’ పేరుతో గూగుల్ స్వంతంగా ప్రారంభించిన ఈ మొబైల్‌ ఫోన్‌ నెట్‌వర్క్ ఇప్పుడు అంతర్జాతీయ మొబైల్‌ టెలికాం కంపెనీల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తోంది. అమెరికాలో ఇప్పటికే గూగుల్ ప్రాజెక్ట్ ఫై టెలికాం సేవలు ప్రారంభమయ్యాయి.

అమెరికాలోని స్ర్పింట్‌ కార్పొరేషన్‌, టి-మొబైల్‌ నెట్‌వర్క్‌కు చెందిన మౌలిక సదుపాయాల ద్వారానే గూగుల్‌ ‘ప్రాజెక్టు ఫై’ టెలికాం సేవలను కూడా ప్రారంభించారు. దీంతో ఈ కంపెనీలకు చెందిన సెల్‌ఫోన్‌ టవర్లతో పాటు దాదాపు 10 లక్షల వైఫై హాట్‌స్పాట్‌ల పరిధిలో ‘నెక్సెస్‌ 6’ ఫోన్‌ను కలిగి ఉన్న యూజర్లు గూగుల్‌ టెలికాం సేవలు పొందవచ్చు.

ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఎలాంటి రోమింగ్‌ ఛార్జీలు లేకుండా 120 దేశాల్లో ఈ నెట్‌వర్క్‌ సపోర్ట్‌ చేస్తుంది. ప్రాజెక్టు ఫై కనెక్షన్‌ తీసుకున్న ఖాతాదారులు తమ మొబైల్‌ ఫోన్‌ నుంచే చౌకగా మొబైల్‌ కాల్స్‌తో పాటు టెక్స్ట్‌ మెసేజ్‌లను కూడా పంపుకోవచ్చు.

ఇంకా స్కైప్‌, వైబర్ లాంటి యాప్స్‌ ద్వారా కూడా ఫోన్‌ కాల్స్‌ చేసుకోవచ్చు. ఫోన్‌లో మాట్లాడుతూ వైఫై కవరేజి ప్రాంతం నుంచి బయట పడినా సరే మీ ఫోన్‌ కాల్‌ క్షణం కూడా కట్‌ కాదు. మీరు మారిన ప్రాంతంలో ఉండే సెల్‌ఫోన్‌ నెట్‌వర్క్‌కు మీ కాల్‌ బదిలీ అవుతుంది.

Google
ప్రస్తుతం అమెరికాలో ఏటి అండ్‌ టి, వెరిజోన్‌ వంటి టెలికాం ఆపరేటర్లు ఫోన్‌ కాల్స్‌, మొబైల్‌ డాటా కోసం కోసం ప్రస్తుతం నెలకు సుమారు 100 డాలర్ల (సుమారు రూ.6,300) వరకూ వసూలు చేస్తున్నాయి. అయితే, గూగూల్‌ మాత్రం తన ప్రాజెక్టు ఫై నెట్‌వర్క్‌ ద్వారా నెలకు కేవలం 20 డాలర్లకే బేసిక్‌ వాయిస్‌, టెక్స్ట్‌ సర్వీసులు అందిస్తోంది. అంతేకాకుండా 1జిబి డేటాని 10 డాలర్లకే అందిస్తుంది.

ఒక నెలలో కస్టమర్లు ఎంత డేటాను వినియోగించుకుంటే, అంత డేటాకు మాత్రమే చార్జి వసూలు చేస్తుంది. ఒకవేళ కస్టమర్ 3జి డేటా కోసం 30 డాలర్ల నగదు చెల్లించి 1.4 జిబి మాత్రమే ఉపయోగించుకుంటే అతడికి మిగతా 16 డాలర్లను వెనక్కు ఇచ్చేస్తానని గూగుల్ ప్రకటించింది.

కాగా.. అమెరికాలోని మిగతా టెలికాం ఆపరేటర్లు మాత్రం ప్రస్తుతం ఉపయోగించుకోని డేటాకు సంబంధించిన నగదును వెనక్కి ఇవ్వకుండా, మిగిలిన సదరు డేటాను తర్వాతి నెలకు బదిలీ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. అత్యంత సరసమైన ధరకే అందుబాటులోకి వచ్చిన గూగుల్‌ ప్రాజెక్ట్ ఫై టెలికాం నెట్‌వర్క్ ప్రపంచ టెలికాం రంగంలో పెద్ద సంచలనాన్ని సృష్టించే అవకాశం ఉంది. త్వరలోనే ఈ గూగుల్ ప్రాజెక్ట్ ఫై టెలికాం సేవలు ఇతర దేశాల్లో కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s