అల్లరి చిత్రం సక్సెస్‌తో ఆ సినిమా పేరును ఇంటి పేరుగా మార్చుకున్న అల్లరి నరేష్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. మే 3వ తేదీన చెన్నైకి చెందిన విరూపతో అల్లరి నరేష్‌కు నిశ్చితార్థం జరగనుంది. కృష్ణా జిల్లాకు చెందిన వధువు తల్లిదండ్రులు చెన్నైలో స్థిరపడ్డారు.
ఈవివి సత్యనారాయణ కుమారుడైన నరేష్ తనదైన శైలిలో హాస్యం పండించడంలో ప్రేక్షకుల మెప్పు పొందుతున్నాడు. మరి ఈ అల్లరోడికి మనం కూడా అభినందనలు తెలియజేద్దాం రండి.