చైనాకు చెందిన స్మార్ట్ఫోన్ తయారీ కంపెనీ షియోమీ అతికొద్ది సమయంలో భారత ఫోన్ మార్కెట్లో గట్టి పట్టు సాధించింది. ప్రస్తుతం ప్రపంచంలో కెల్లా అతిపెద్ద టాప్ 3 స్మార్ట్ఫోన్ కంపెనీలలో ఒకటైన షియోమీ, మన దేశ పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటాను ఆకర్షించింది.
టాటా సన్స్ అధినేత రతన్ టాటా షియోమీ కంపెనీలో కొంత మొత్తాన్ని పెట్టుబడిగా వెచ్చించారు. రానున్న 3-5 ఏళ్లలో భారత మార్కెట్లో అగ్రస్థానాన్ని చేజిక్కించుకోవటమే తమ లక్ష్యం అని షియోమీ పేర్కొంది.
ఈ లక్ష్యంలో భాగంగానే, భారత్లో ఓ తయారీ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయనున్నట్టు షియోమీ సంస్థ వ్యవస్థాపకులు లీ జున్ తెలిపారు. కాగా, షియోమీలో ఒక భారతీయ సంస్థ వాటాను కొనుగోలు చేయడం ఇదే మొట్టమొదటి సారి. అయితే, ఎంత మొత్తం వెచ్చించి ఈ వాటాలు కొనుగోలు చేసిన సంగతిని ఇరు కంపెనీలు వెల్లడించలేదు.