ఒక కథ ప్రకారం.. అశోకవనంలో ఉన్న సీతమ్మవారికి, హనుమంతుడు రాములవారి సందేశము చెప్పినప్పుడు, అమ్మవారు ఆనందంతో హనుమంతునికి తమలపాకుల దండ వేశారట, దగ్గరలో పువ్వులు కనిపించక! అందుకే స్వామికి తమలపాకుల దండ అంటే ప్రీతి అని చెప్తారు. అంజనేయ స్వామిని తమలపాకులతో పూజించటం వలన అనేక ప్రయోజనాలు చేకూరుతాయి. అవేంటో తెలుసుకుందాం రండి..!
-> ఆంజనేయ స్వామికి లేత తమలపాకుల మాలను వేస్తే రోగాలతో ఇబ్బందులు పడేవారికి త్వరగా గుణం కనిపిస్తుంది.
-> ఇంట్లో మాంత్రిక దోషాలు ఉన్నవారు ఆంజనేయస్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే మంత్ర సంబందమైన పీడలు తొలగిపోతాయి.
-> సంసారంలో ప్రశాంతత లేని వారు స్వామికి తమల పాకుల హారాన్ని వేయిస్తే సంసారంలో సుఖం లబిస్తుంది.
-> కొందరు చిన్న పిల్లలు ఎంత ఆహారాన్ని తిన్నప్పటికీ సన్నగానే ఉంటారు. చాలా నీరసంగా కనిపిస్తుంటారు. ఇలాంటి వారు స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే ఆరోగ్యం బాగుపడి చక్కగా ఎదుగుతారు.
-> వ్యాపారంలో చాల నష్టాలు వస్తుంటే స్వామికి తమలపాకుల హారాన్ని వేయించి తమలపాకులు, పండ్లు దక్షిణ సమేతంగా దానం చేస్తే వ్యాపారం వృద్ధిలోకి వస్తుంది.
-> ఏ వ్యక్తి అయితే హీనంగా చుడబడుతాడో అటువంటి వ్యక్తి స్వామికి తమలపాకుల హారాన్ని సమర్పిస్తే సంఘంలో గౌరవం లభిస్తుంది.
-> శనైశ్చర దృష్టి ఉన్నవారు ఆంజనేయ స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే శనీశ్వరుని అనుగ్రహం కలుగుతుంది
-> వైద్య పరంగా నయంకానీ వ్యాధులు ఉన్నవారు స్వామికి తమలపాకుల హారాన్ని వేసి, ప్రసాదాన్ని స్వీకరిస్తే అన్ని రోగాలు నయమవుతాయి.
-> సుందర కాండ పారాయణం చేసి స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే అన్ని కార్యాలలో విజయం సిద్ధిస్తుంది.
-> హనుమాన్ చాలీసా చదివి స్వామిని ప్రార్ధించి తమలపాకుల హారాన్ని వేస్తే పరమాత్మని అనుగ్రహం కలుగుతుంది.
-> వాద ప్రతివాదాల్లో స్వామిని ప్రార్ధించిచి తమలపాకుల హరాన్ని సమర్పించి, ప్రసాదం తీసుకుంటే జయం మీదే అవుతుంది.