మొబైల్ ఫోన్ ప్రపంచంలో సరికొత్త విప్లవానికి తెరలేపిన కంపెనీ నోకియా. ఫిన్లాండ్కి చెందిన ఈ ఫోన్ల తయారీ కంపెనీ గతంలో అనేక రకాల ఫీచర్, స్మార్ట్ఫోన్లను మార్కెట్‌కు పరిచయం చేసింది. మధ్య తరగతి ప్రజల ఫోన్ కలను నిజం చేసింది.
అయితే, మొబైల్ ఫోన్ రంగంలో ప్రస్తుత కంపెనీల నుంచి ఎదురవుతున్న పోటీని సమర్థవంతంగా ఎదుర్కోలేక తమ కంపెనీని మైక్రోసాఫ్ట్‌కి అమ్మేసింది. కాగా.. నోకియా తిరిగి ఫోన్ మార్కెట్లోకి ప్రవేశించే అవకాశాలున్నాయని ఇటీవలి కాలంలో పుకార్లు షికార్లు చేశాయి.
ఈ నేపథ్యంలో, నోకియా ఈ పుకార్లపై స్పందిస్తూ.. తిరిగి హ్యాండ్ సెట్ల తయారీకి పూనుకోవడంలేదని స్పష్టం చేసింది. ఫోన్ మార్కెట్లోకి పునఃప్రవేశం చేస్తున్నట్లు వచ్చిన కథనాలన్నీ అవాస్తవమని నోకియా తమ అధికారిక వెబ్ సైట్లో పేర్కొంది.