లక్ అంటే ఇదే.. సెకండ్ హ్యాండ్ కారులో కరెన్సీ కట్టలు..!

‘తంతే బూరెల బుట్టలో పడ్డట్లు’ అన్న సామెత ఎంత వరకూ నిజమో తెలియదు కానీ, ఈ అమెరికన్ విషయంలో మాత్రం ఇది ముమ్మాటికీ నిజమైంది. వివరాల్లోకి వెళితే..

అమెరికాకు చెందిన ఓ వ్యక్తి సెకండ్ హ్యాండ్ జీప్‌ను కొనుగోలు చేశాడు. ఓ రోజు కారు పవర్ విండో పనిచేయటం ఆగిపోయింది. ఈ చిన్న మరమ్మత్తు కోసం మెకానిక్ వరకూ వెళ్లటం ఎందుకని, అతని చేతులకే పనిచెప్పాడు సదరు వ్యక్తి.

డోర్ ప్యానెల్ విప్పి చూడగా. అందులో ప్లాస్టిక్ పేపర్లలో చుట్టిన ఏడు కరెన్సీ కట్టలు (అన్నీ అమెరికన్ డాలర్లే) బయటపడ్డాయి. ఆ కరెన్సీ కట్టలో పవర్ విండో మెకానిజం‌కు అడ్డుపడి, పనిచేయటాన్ని ఆపివేశాయి.

డబ్బును చూసిన ఆనందంలో సదరు వ్యక్తి ఎగిరి గంతేసి, ఆ విషయాన్ని గోప్యంగా ఉంచకుండా ఇదిగో ఇలా ఫొటోలు తీసి సోషల్ నెట్‌వర్క్‌లో పెట్టాడు. పాత కారుతో పాటుగా కొత్త కారును కొనుగోలు చేసేంత డబ్బు కూడా లభించడం విశేషం. మరి లక్ అంటే అతడిదే కదా..!

moneyMoney

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s