నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన ‘లయన్’ చిత్రానికి సెన్సార్ పూర్తయింది. నూతన దర్శకుడు సత్యదేవా దర్శకత్వంలో రూపొందిన ‘లయన్’ చిత్రాన్ని చూసిన సెన్సార్ సభ్యులు ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికేట్ జారీ చేశారు.
కాగా.. లయన్ చిత్రాన్ని మే 8వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు దర్శక నిర్మాతలు ఏర్పాట్లు చేస్తున్నారు. త్రిష, రాధికా ఆప్టే నాయికలుగా నటించిన ఈ చిత్రాన్ని ఎస్.ఎల్.వి. సినిమా పతాకంపై రుద్రపాటి రమణారావు నిర్మించగా, సత్యదేవ దర్శకుడిగా పరిచయమవుతున్నారు.
లయన్ సినిమా నిడివి 149 నిముషాలు అంటే 2 గంటల 29నిముషాలు ఉందని సమాచారం. బాలకృష్ణ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ చిత్రంలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్నారట. మరి బాలయ్య బాబు యాక్షన్ని చూసేందుకు మీరు కూడా రెడీగా ఉన్నారా..?