ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, యువ హీరో దగ్గుబాటి రాణా కలయిలో రూపుదిద్దుకుంటున్న భారీ బడ్జెట్ చిత్రం ‘బాహుబలి’కి సంబంధించి ఆ చిత్ర దర్శకుడు ఇటీవలే తన ట్విట్టర్ ఖాతాలో మొదటి అఫీషియల్ పోస్టర్‌ను విడుదల చేసిన సంగతి తెలిసినదే.
అయితే, తాజాగా బాహుబలి చిత్రానికి సంబంధించిన రెండవ అఫీషియల్ పోస్టర్‌ను కూడా రాజమౌళి తన ట్విట్టర్ పేజీలో పోస్ట్ చేశారు. “ఆ గంగను మోసిన జంగమదేవుని నెత్తిన మోసినదెవడు! నరనరమున సత్తువ ఉరకలు వేసిన నరోత్తముడు ఎవడు!” అని వ్యాఖ్యానిస్తూ శివలింగాన్ని మోస్తున్న ప్రభాస్ ఫోటోతో కూడిన పోస్టర్‌ను రిలీజ్ చేశారు.
ఈ పోస్టర్లో ప్రభాస్ సిక్స్ ప్యాక్ లుక్‌ని మనం గమనించవచ్చు. ఇకపోతే.. ప్రభాస్, అనుష్క, రానా, తమన్నా, సత్యరాజ్, రమ్య కృష్ణలు ముఖ్య పాత్రలు పోషిస్తున్న బాహుబలు చిత్రం షూటింగ్ ఇప్పటికే దాదాపుగా పూర్తయినట్లు సమాచారం. అయితే, పోస్ట్ ప్రొడక్షన్ పనులు, విజువల్ గ్రాఫిక్స్ విషయంలో జాప్యం కారణంగా ఈ చిత్రాన్ని అనుకున్న సమయానికి విడుదల చేయలేకపోతున్నట్లు తెలుస్తోంది.