మనకు విరివి లభించే పండ్లలో బొప్పాయి కూడా ఒకటి. బొప్పాయి పండు తినడం వలన వేడి చేస్తుందని చాలా మంది భావిస్తుంటారు. కానీ బొప్పాయి పండులో దాగి ఉన్న ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకుంటే వారు ఇకపై ఆ మాట అనరు.
బొప్పాయి పండు సహజసిద్ధమైన వ్యాధి నిరోధకంగా పనిచేస్తుంది. ఇది శరీరంలో ఇమ్యూనిటీ సిస్టమ్ పనితీరును మెరుగు పరుస్తుంది. ఇందులో విటమిన్ ఏ, సి, ఇ లు పుష్కలంగా లభిస్తాయి.బొప్పాయిని తీసుకోవడం ద్వారా ఒబేసిటీకి చెక్ పెట్టవచ్చునని న్యూట్రీషన్లు చెబుతున్నారు.
శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రించాలంటే రోజూ పరగడుపున ఒక కప్పు బొప్పాయిని తీసుకోవడం మంచిది. బొప్పాయిలో పీచు పదార్థాలు ఎక్కువగా లభిస్తాయి. ఇది జీర్ణ సమస్యలను దూరం చేస్తుంది. శరీరానికి కావల్సిన శక్తిని ఇస్తుంది.
చర్మ వ్యాధులను నయం చేయటంలోను, చర్మ సంరక్షణకు మేలు చేయటంలోను బొప్పాయి చక్కగా పనిచేస్తుంది. కంటికి మేలు చేస్తుంది. దృష్టిలోపాలను నయం చేయడంలో బొప్పాయి దివ్యౌషధంగా పనిచేస్తుంది. గుండె సంబంధిత వ్యాధులను నయం చేయడంతో పాటుగా క్యాన్సర్ నిరోధకంగా కూడా బొప్పయి పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.