హీరో మోటోకార్ప్ అందిస్తున్న బెస్ట్ సెల్లింగ్ మోటార్‌సైకిల్ ‘ప్యాషన్ ప్రో’ మోడల్లో కంపెనీ ఓ సరికొత్త 2015 వెర్షన్‌ను మార్కెట్లో విడుదల చేసింది. కొత్త 2015 హీరో ప్యాషన్ ప్రో మోటార్‌సైకిల్‌లో కాస్మోటిక్ అప్‌గ్రేడ్స్‌తో పాటుగా కొద్దిపాటి మెకానికల్ అప్‌గ్రేడ్స్ కూడా ఉన్నాయి.
2015 హీరో ప్యాషన్ ప్రో బైక్‌లో ముందు వైపు కొత్త మడ్‌గార్డ్, వెనుక వైపు ఎల్ఈడి టెయిల్ ల్యాంప్‌ను అమర్చారు. ఇందులో కొత్తగా 6-స్పోక్ అల్లాయ్ వీల్స్‌ను ఆఫర్ చేస్తున్నారు. ఇది రెగ్యులర్ కలర్స్‌తో పాటుగా కొత్తగా బ్రౌన్ కలర్లో కూడా లభ్యం కానుంది.
మెకానికల్ అప్‌గ్రేడ్ విషయానికి వస్తే.. కొత్త 2015 హీరో ప్యాషన్ ప్రోలో ఉపయోగించిన 97.2సీసీ ఇంజన్ పవర్‌ను 7.69 బిహెచ్‌పిల నుంచి 8.24 బిహెచ్‌పిలకు పెంచారు. కానీ, టార్క్‌లో మాత్రం ఎలాంటి మార్పు చేయలేదు. ఇది 8.05 ఎన్ఎమ్ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది.
2015 హీరో ప్యాషన్ ప్రో వేరియంట్లు – ధరలు:
-> కిక్ స్టార్ట్, స్పోక్ వీల్స్ – రూ.47,650
-> కిక్ స్టార్ట్, అల్లాయ్ వీల్స్ – రూ.48,700
-> సెల్ఫ్ స్టార్ట్, స్పోక్ వీల్స్ – రూ.49,650
-> సెల్ఫ్ స్టార్ట్, అల్లాయ్ వీల్స్ – రూ.50,600
-> సెల్ఫ్ స్టార్ట్, అల్లాయ్ వీల్స్, డిస్క్ బ్రేక్ – రూ.52,500
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)