పచ్చి మిర్చి ఎక్కువగా తింటే అల్సర్ వస్తుందని చాలా మంది చెబుతూ ఉంటారు. కానీ, వీటిని ఒక నిర్ణీత పరిధిలో తీసుకుంటే ఆరోగ్యాని ఎలాంటి ఢోకా లేదని, పైపెచ్చు ఇందులో అనేక ఔషధ గుణాలున్నాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
ఆస్ట్రలియాలో టాస్మేనియా యూనివర్సిటీ పరిశోధకులు నిర్వహించిన ఓ సర్వే ప్రకారం.. పచ్చి మిర్చిని అధికంగా వినియోగించేవారిలో షుగర్ నియంత్రణ శక్తి ఎక్కువగా ఉంటుందని తేలింది. గ్రీన్ చిల్లీలో ఉండే కెప్సానిన్, డీహైడ్రాకెప్సానిన్‌లకు రక్తంలో గ్లూకోజ్ శాతం నిల్వలను తగ్గించే శక్తి ఉందట.
పచ్చి మిర్చిని అధిక మోతాదులో తినేవారిలో రక్తం గడ్డకట్టే అవకాశం తక్కువగా ఉంటుందని ఆస్ట్రేలియా పరిశోధకులు చెబుతున్నారు. పచ్చి మిర్చి ఘాటును భరించలేని వారు చిల్లీ సాస్‌తో సరిపెట్టుకోవచ్చు లేదా మిర్చీ ఘాటును తగ్గించే విధంగా వంటల్లో వాడుకోవచ్చు.