2002లో జరిగిన ‘హిట్ అండ్ రన్’ కేసులో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌కు ముంబై సెషన్స్ కోర్టు దోషిగా నిర్ధారించి, ఐదేళ్ల జైలు శిక్షను విధించింది. యాక్సిడెంట్ సమయంలో కారును డ్రైవర్ నడిపారనే లాయర్ల వాదనను కోర్టు తోసిపుచ్చింది.
సల్మాన్ ఖాన్ మద్యం మత్తులో కారు నడిపారని కోర్టు తెలిపింది. కారును డ్రైవర్ నడిపినట్లు ఆధారాలు లేవని, డ్రైవర్ నడిపారంటూ కోర్టును తప్పుదోవ పట్టించారని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. డ్రైవింగ్ సమయంలో సల్మాన్‌కు లైసెన్స్ కూడా లేదని ముంబై సెషన్స్ కోర్టు పేర్కొంది. అప్పుడు జరిగిన యాక్సిడెంట్లో ఒకరు చనిపోగా, నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
తీర్పు అనంతరం ముంబై పోలీసులు సల్మాన్ ఖాన్‌ను తమ కస్టడీలోకి తీసుకున్నారు. అయితే, ఆయనకు వెంటనే రెండు రోజుల తాత్కాలిక బెయిల్ మంజూరు చేస్తూ ముంబై హైకోర్టు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. అరెస్ట్ అయినట్లే అయ్యి బెయిలుపై జైలు నుంచి వచ్చేసారు సల్మాన్ ఖాన్.