ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, యువ హీరో దగ్గుబాటి రాణా, అనుష్క, తమన్నా, రమ్యక్రిష్ణ తదితరుల కలయిలో రూపుదిద్దుకుంటున్న భారీ బడ్జెట్ చిత్రం ‘బాహుబలి’కి సంబంధించి ఆ చిత్ర దర్శకుడు తాజాగా మరో రెండు పోస్టర్లను విడుదల చేశారు.
ఇందులో ఓ పోస్టర్లో ‘శివగామి’గా రమ్యక్రిష్ణ కనిపిస్తారు. ఆమె ఈ సినిమా కోసం మా బృందంతో కలిసి రెండున్నర సంవత్సరాల పాటు పనిచేశారని రాజమౌళి ట్వీట్ చేశారు.
ఇకపోతే ఈ చిత్రంలో మరో పాత్ర ‘కాలకేయ’. కాలకేయగా ప్రతినాయకుడు ప్రభాకర్ (మర్యాదరామన్నలో జయప్రకాష్ పెద్ద కొడుకు పాత్ర పోషించిన వ్యక్తి) కనిపిస్తాడు. ‘రక్తం అతన్ని దాహం తీర్చుతుంది.. హింసే అతనికి శాంతిని కలిగిస్తుంది.. లక్ష మందికి అనాగరికులకు అతను సైన్యాధిపతి’ అంటూ రాజమౌళి ఓ ట్వీట్ చేసి, ఈ ఫొటో విడుదల చేశారు.