మారుతి సుజుకి అందిస్తున్న తొలి ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ (ఏఎమ్‌టి) కారు ‘సెలెరియో’ (Celerio)లో కంపెనీ తాజాగా
మరో కొత్త వేరియంట్‌ను విడుదల చేసింది. మార్కెట్లో ఈ వేరియంట్ ధర రూ.4.99 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది.
ఈ కొత్త మారుతి సుజుకి సెలెరియో జెడ్ఎక్స్ఐ వేరియంట్లో డ్రైవర్ సైడ్ ఎయిర్‌బ్యాగ్, బ్లూటూత్ సపోర్ట్ ఆడియో సిస్టమ్, ఎలక్ట్రిక్ సైడ్ మిర్రర్స్, స్టీరింగ్ వీల్‌పై ఆడియో కంట్రోల్, బాడీ రలర్ సైడ్ మిర్రర్స్, బాడీ కలర్ బంపర్స్ వంటి ఫీచర్లు లభిస్తాయి.
ఇంజన్ పరంగా ఈ కొత్త వేరియంట్లో ఎలాంటి మార్పులు లేవు. ఇందులోని 1.0 లీటర్ కె-సిరీస్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 67 బిహెచ్‌పిల శక్తిని, 90 ఎన్ఎమ్ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ ఏఎమ్‌టి (ఈజీ షిఫ్ట్) గేర్‌బాక్స్‌తో కనెక్ట్ చేయబడి ఉంటుంది.