మనకు విరివిగా లభించే డ్రైఫ్రూట్స్లలో ఎండు ద్రాక్ష (కిస్మిస్) కూడా ఒకటి. ఎండు ద్రాక్షలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో ఐరన్ పుష్కలంగా లభిస్తుంది, ఇది రక్తహీనత ఏర్పడకుండా ఉంచడంలో సహకరిస్తుంది.
ఎండు ద్రాక్షలో ఉండే విటమిన్ బి రక్తకణాల నిర్మాణంలో ఉపయోగపడుతుంది. ఆకలిని ఎక్కువ చేసే లెప్టిన్ని నియంత్రించడంలో ఎండు ద్రాక్షలు చక్కగా పనిచేస్తాయి. బరువు తగ్గాలనుకునే వారు తమ డైట్లో ఎండు ద్రాక్షలను చేర్చుకుంటే ఫలితం కనిపిస్తుంది.
ఎండు ద్రాక్షలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి, ఇవి వైరస్, బ్యాక్టీరియాలతో పోరాడటంలో సహకరిస్తాయి. కాబట్టి ఇన్ఫెక్షన్లు, జ్వరం వంటివి మన దక్కరికి కూడా రావు.
రక్తంలో ఉండే యాసిడోసిస్ అనే టాక్సిన్ చర్మవ్యాధులు, ఆర్థరైటిస్, క్యాన్సర్, ట్యూమర్లు వంటి వాటిని కలిగిస్తుంది. ఎండుద్రాక్షల్లో ఉండే పొటాసియం, మెగ్నీసియం యాసిడోసిస్ను నియంత్రించి ఆరోగ్యాన్ని కాపాడటంలో సహకరిస్తుంది. ఎండుద్రాక్షల్లో కాల్షియం ఎక్కువ ఉంటుంది కనుక ఎముకలు దృఢంగా అవుతాయి. దంతక్షయాన్ని నివారించడంలో కూడా ఇవి ఉపయోగపడుతాయి.