టాటా మోటార్స్ అందిస్తున్న ప్రజల కారు టాటా నానోలో కంపెనీ ఓ కొత్త 2015 వెర్షన్‌ను తాజాగా మార్కెట్లో విడుదల చేసింది. ‘టాటా నానో జెనెక్స్’ (Tata Nano GenX) పేరుతో మార్కెట్లోకి వచ్చిన ఈ కొత్త నానో కారు మ్యాన్యువల్ మరియు ఆటోమేటెడ్ మ్యాన్యువల్ (ఎఎమ్‌టి) గేర్‌బాక్స్‌లతో లభ్యం కానుంది.
భారత విపణిలో కొత్త 2015 టాటా నానో జెనెఎక్స్ మోడల్ కేవలం ర.1.99 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ప్రారంభ ధరకే లభ్యం కానుంది. టాటా నానో జెనెక్స్ కారులో ఉపయోగించిన ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ (ఏఎమ్‌టి) టెక్నాలజీనే కంపెనీ ఈజీ షిఫ్ట్‌గా వ్యవహరిస్తోంది.
కొత్త 2015 టాటా నానో కారులో అనేక కాస్మోటిక్, ఫీచర్ అప్‌గ్రేడ్స్ ఉన్నాయి. ఇదివరకటి నానో కార్లతో పోల్చుకుంటే ఈ కొత్త 2015 నానో జెనెక్స్ కారు మరింత అందంగా కనిపిస్తుంది అంతేకాకుండా ఇందులో మరిన్ని అదనపు ఫీచర్లు కూడా లభ్యం కానున్నాయి.
ఇంజన్ పరంగా కొత్త నానో జెనెక్స్ కారులో ఎలాంటి మార్పులు లేవు. ఇది 4-స్పీడ్ మ్యాన్యువల్, ఏఎమ్‌టి గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తుంది. మ్యాన్యువల్ వెర్షన్ లీటరుకు 25.3 కి.మీ. మైలేజీని, ఏఎమ్‌టి వెర్షన్ లీటరుకు 21.9 కి.మీ. మైలేజీని ఆఫర్ చేస్తుందని కంపెనీ పేర్కొంది.
టాటా నానో జెనెక్స్ ధరలు
నానో జెనెక్స్ ఎక్స్ఈ (మ్యాన్యువల్) – రూ.1.99 లక్షలు
నానో జెనెక్స్ ఎక్స్ఎమ్ (మ్యాన్యువల్) – రూ.2.29 లక్షలు
నానో జెనెక్స్ ఈజీ షిఫ్ట్ ఎక్స్ఎమ్ఏ (ఆటోమేటిక్) – రూ.2.69 లక్షలు
నానో జెనెక్స్ ఈజీ షిఫ్ట్ ఎక్స్టిఏ (ఆటోమేటిక్) – రూ.2.89 లక్షలు
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)