వోల్వో ఎస్60 టి6 విడుదల

స్వీడన్‌కి చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ వోల్వో ఇండియా.. తాజాగా దేశీయ విపణిలో ఓ సరికొత్త కారును విడుదల చేసింది. వోల్వో ఇండియా అందిస్తున్న ఎస్60 సెడాన్‌లో పెట్రోల్ వెర్షన్‌ను కంపెనీ ప్రవేశపెట్టింది. వోల్వో ఎస్60 టి6 పేరుతో లభ్యం కానున్న ఈ కారు ధర రూ.42 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).

ఈ కారులో 2.0 లీటర్ టి6 పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 306 బిహెచ్‌పిల శక్తిని, 400 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో కనెక్ట్ చేయబడి ఉంటుంది.

వోల్వో ఎస్60 టి6లో 18 ఇంచ్ అల్లాయ్ వీల్స్, ఉడ్ అండ్ లెథర్ ఫినిష్ ఇంటీరియర్స్, స్పోర్ట్స్ సీట్స్, 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబిఎస్, నావిగేషన్ సిస్టమ్‌లు స్టాండర్డ్ ఫీచర్లుగా లభిస్తాయి.
Volvo S60 T6

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s