మధువులొలికే కోమలమైన పెదవుల కోసం..!

కవులు పెదవులను మధువుతో పోలుస్తుంటారు.. అందమైన పెదవులు అవతలి వారిని ఇట్టే ఆకర్షిస్తాయి.. మరి మీ పెదవులను అందంగా ఉంచుకునేందుకు కొన్ని చిట్కాలను ఈ కథనంలో తెలుసుకుందాం రండి..!

* కొన్ని గులాబీ రేకలను మెత్తగా చేసి దానికి చెంచా తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని పెదవులకు రాసి పావుగంట తర్వాత కడిగేస్తే సరిపోతుంది. ఇలా తరచూ చేయడం వల్ల పెదవులు మృదువుగా మారతాయి.

* కొన్ని దానిమ్మ గింజల్ని మెత్తగా చేసి దానికి కొంచెం పాలు చేర్చాలి. ఈ మిశ్రమాన్ని పెదవులకు రాసి పది నిమిషాల తర్వాత కడిగేసినా మంచి ఫలితం ఉంటుంది.

* కీరదోస రసాన్ని పెదవులకు రాసి పది నిమిషాలయ్యాక కడిగేయాలి. తరవాత చిన్న ఐసు ముక్క తీసుకుని పెదవులపై ఐదు నిమిషాల పాటు రుద్దాలి. దీనివల్ల రక్తప్రసరణ సరిగా అంది పెదవులు మృదువుగా మారతాయి.

* బొప్పాయి, అనాస ముక్కలను మెత్తగా చేసి పెదాలకు రాసి పావుగంట తర్వాత కడిగేయాలి. దీనివల్ల నల్లబడిన పెదాలు గులాబీ రంగులోకి రావడమే కాదు మృదుత్వాన్నీ పొందుతాయి.

* అరచెంచా నెయ్యిలో కొంచెం ఉప్పు చేర్చి పెదవులకు రాయాలి. పావుగంట తర్వాత గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేస్తే సరిపోతుంది. ఇది పగిలిన పెదవులకు చక్కటి పరిష్కారం.
lips

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s