భారతదేశపు ద్వితీయ అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్ ఇండియా కూడా కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్లోకి ప్రవేశించింది. ఈ సెగ్మెంట్లో ‘హ్యుందాయ్ క్రెటా’ (Hyundai Creta) పేరుతో ఓ అధునాత మోడల్‌ను కంపెనీ విడుదల చేసింది.
హ్యుందాయ్ క్రెటా 1 పెట్రోల్, 2 డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభ్యం కానుంది. అవి:-
పెట్రోల్ వెర్షన్ హ్యుందాయ్ క్రెటాలో 1.6 లీటర్ డ్యూయెల్ విటివిటి ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 121 బిహెచ్‌పిల శక్తిని, 155 ఎన్ఎమ్ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది కేవలం మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ (గేర్‌బాక్స్)తో మాత్రమే లభిస్తుంది.
మొదటి డీజిల్ వెర్షన్లో ఉపయోగించిన 1.4 లీటర్ సిఆర్డిఐ డీజిల్ ఇంజన్ గరిష్టంగా 89 బిహెచ్‌పిల శక్తిని, 200 ఎన్ఎమ్ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది కూడా కేవలం మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ (గేర్‌బాక్స్)తో మాత్రమే లభిస్తుంది.
ఇకపోతే రెండవ డీజిల్ వెర్షన్లో ఉపయోగించిన 1.6 లీటర్ సిఆర్డిఐ డీజిల్ ఇంజన్ గరిష్టంగా 126 బిహెచ్‌పిల శక్తిని, 260 ఎన్ఎమ్ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మ్యాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ (గేర్‌బాక్స్) ఆప్షన్లతో లభిస్తుంది.
- హ్యుందాయ్ క్రెటా ఏఆర్ఏఐ సర్టిఫైడ్ మైలేజ్:
1.6 లీటర్ పెట్రోల్ (మ్యాన్యువల్) – 15.29 కెఎంపిఎల్
1.6 లీటర్ డీజిల్ (మ్యాన్యువల్) – 19.67 కెఎంపిఎల్
1.6 లీటర్ డీజిల్ (ఆటోమేటిక్) – 17.01 కెఎంపిఎల్
1.4 లీటర్ డీజిల్ (మ్యాన్యువల్) – 21.38 కెఎంపిఎల్
టాప్ ఎండ్ వేరియంట్ హ్యుందాయ్ క్రెటా ఎస్‌యూవీలో సైడ్ అండ్ కర్టెన్ ఎయిర్‌బ్యాగ్స్, యాంటీ-లాక్ బ్రేక్ సిస్టమ్, రివర్స్ పార్కింగ్ కెమెరా, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్ కంట్రోల్, వెహికల్ స్టెబిలిటీ మేనేజ్మెంట్, కార్నరింగ్ ల్యాంప్స్, ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్ వంటి కీలక సేఫ్టీ ఫీచర్లు లభ్యం కానున్నాయి.
- భారత మార్కెట్లో హ్యుందాయ్ క్రెటా ధరలు:
1.6 ఎల్ పెట్రోల్ – రూ. 8.59 లక్షలు
1.6 ఎస్ పెట్రోల్ – రూ. 9.57 లక్షలు
1.6 ఎస్ఎక్స్+ పెట్రోల్ – రూ. 11.19 లక్షలు
1.4 బేస్ డీజిల్ – రూ. 9.46 లక్షలు
1.4 ఎస్ డీజిల్ – రూ. 10.42 లక్షలు
1.4 ఎస్+ డీజిల్ – రూ. 11.45 లక్షలు
1.6 ఎస్ఎక్స్ డీజిల్ – రూ. 11.59 లక్షలు
1.6 ఎస్ఎక్స్+ డీజిల్ – రూ. 12.67 లక్షలు
1.6 ఎస్ఎక్స్ (ఆప్షనల్) డీజిల్ – రూ. 13.60 లక్షలు
1.6 ఎస్ఎక్స్+ ఆటోమేటిక్ డీజిల్ – రూ. 13.57 లక్షలు
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)