భారతదేశపు అగ్రగామి యుటిలిటీ వాహనాల తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా అందిస్తున్న పాపులర్ ఆఫ్-రోడ్ వాహనం మహీంద్రా థార్ (Mahindra Thar)లో కంపెనీ ఓ సరికొత్త అప్‌గ్రేడెడ్ వెర్షన్‌ను తాజాగా మార్కెట్లో విడుదల చేసింది.
కాకపోతే ఈ అప్‌గ్రేడెడ్ వెర్షన్ కేవలం మహీంద్రా థార్ సిఆర్‌డిఈ వేరియంట్లో మాత్రమే లభ్యం కానుంది, డిఐ వేరియంట్లో లభ్యం కాదు. ఈ కొత్త 2015 మహీంద్రా థార్ సిఆర్‌డిఈ ధరను రూ.8.03 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు.
- కొత్త మహీంద్రా థార్ సిఆర్డిఈలో చేసిన అప్‌గ్రేడ్స్ ఏంటంటే..
కొత్త ఫ్రంట్ అండ్ రియర్ బంపర్స్
కొత్త వీల్ ఆర్చెస్
కొత్త సైడ్ ఫుట్‌స్టెప్స్
రీడిజైన్డ్ క్యానోపీ
క్లియర్ లెన్స్ హెడ్‌ల్యాంప్స్
డ్యూయెల్ టోన్ డ్యాష్‌బోర్డ్
3-పాడ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్
రీడిజైన్డ్ ఏసి వెంట్స్
కొత్త స్టీరింగ్ వీల్ అండ్ గేర్ నాబ్
కొత్త ఫ్లోర్ కన్సోల్ (కప్ హోల్డర్స్)
డబుల్ డిన్ మ్యూజిక్ ప్లేయర్ సౌలభ్యం
మహీంద్రా థార్ సిఆర్‌డిఈ ఇంజన్:
ఇంజన్ విషయానికి వస్తే.. ఇందులో ఉపయోగించిన 2500సీసీ సిఆర్‌డిఈ డీజిల్ ఇంజన్ గరిష్టంగా 3800 ఆర్‌పిఎమ్ వద్ద 105 బిహెచ్‌పిల శక్తిని, 1800-2000 ఆర్‌పిఎమ్ వద్ద 274 ఎన్ఎమ్ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇందులో హై అండ్ లో రేషియోలతో కూడిన స్టాండర్డ్ ఫోర్ వీల్ డ్రైవ్ సిస్టమ్ (4×4) ఉంటుంది.