ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ కారణంగా అనేక ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగ కార్యకలాపాలకు బ్రేక్ పడుతున్న సంగతి మనందరికీ తెలిసినదే. ఈ నేపథ్యంలో దేశంలోని ప్రతి పౌరుడికి సంబంధించిన ఆధార్ మరియు పాన్‌కార్డ్ లింకింగ్ ప్రక్రియకు ఇదివరకు అనుకున్న గడువు తేదీని మరికొంత కాలం పొడగిస్తున్నట్లు కేంద్రం పేర్కొంది.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు వెల్లడించిన వివిరాల ప్రకారం.. ఆధార్‌తో పాన్‌కార్డును జతచేసుకునేందుకు గాను గడువు తేదీని జూన్ 30, 20210 వరకూ పొడగిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇదివరకటి ప్రకారం (వైరస్ ప్రభలించక మునుపు) ఈ గడువు తేదీ మార్చి 31, 2020 గా ఉండేది.
దేశంలోకరోనా వైరస్ శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థను మాంద్యంలోకి జారిపోకుండా ఉండేందకు కేంద్రం ఓ ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని ప్రకటించే అవకాశముందని ఈ సందర్భంగా ఆమె తెలిపారు.
ఇప్పటికే పాన్ కార్డు లేని వారు తమ పాన్ కార్డును ఆదాయపు పన్ను శాఖ నుంచి పొందవచ్చు. ఆధార్, పాన్ కార్డులను గడువు తేదీ లోపుగా లింక్ చేయకపోయినట్లయితే, సదరు వ్యక్తులు సుమారు రూ.10,000 వరకూ జరిమానా చెల్లించాల్సి రావచ్చు.