కరోనా వైరస్ నివారణ కోసం దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న లాకవుట్ నేపథ్యంలో పన్న చెల్లింపుదారుల కోసం కేంద్రం ఓ చల్లటి కబరు తెచ్చింది. ఐటి రిటర్న్స్ చెల్లించే టాక్స్ పేయర్స్ కోసం కేటాయించిన గడువు తేదీని మరో నెల రోజుల పాటు పొడగిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు.
ప్రస్తుతం 2018-19 ఆర్థిక సంవత్సరానికి గాను ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ దాఖలుకు గడువు తేదీ మార్చి 31, 2020 గా ఉండగా, కరోనా వైరస్ మరియు దేశ్యాప్త లాకవుట్ నేపథ్యంలో ఈ గడువు తేదీని జూన్ 30, 2020 వరకు పొడిగిస్తున్నట్లు సీతారామన్ తెలిపారు.
అంతేకాకుండా మార్చి 20 నుంచి జూన్ 30 మధ్యకాలంలో అడ్వాన్స్డ్ ట్యాక్స్, సెల్ఫ్ అసెస్మెంట్ ట్యాక్స్, రెగ్యులర్ ట్యాక్స్, టీడీఎస్, టీసీఎస్, ఈక్వలైజేషన్ లేవీ, ఎస్టీటీ, సీటీటీ వంటి వాటికి సంబంధించిన లేట్ పేమెంట్స్‌పై కూడా వడ్డీ పెనాల్టీని 9 శాతానికి తగ్గిస్తున్నట్లు ఆమె తెలిపారు.
ఈ మేరకు మీడియా సమావేశం ఏర్పాటు చేసిన సీతారామన్, ఈ ప్రెస్మీట్లో పలు ఇతర కీలక అంశాలను కూడా ప్రస్తావించారు. ఇందులో భాగంగానే, బ్యాంక్ కస్టమర్లకు ప్రయోజనం కలిగించేలా మినిమమ్ బ్యాలెన్స్ చార్జీలను కూడా తొలగిస్తున్నామని, జూన్ 30 వరకూ ఏ బ్యాంకు ఏటీఎం నుంచైనా డబ్బులు విత్‌డ్రా చేసినా సరే అందుకు సంబంధించిన చార్జీలను ఉపసంహరిస్తున్నామని ఆమె తెలిపారు.