కరోనా వైరస్ను నివారించేందుకు సామాజిక దూరం (సోషల్ డిస్టన్స్), స్వీయ నిర్భంధం (సెల్ఫ్ క్వరెంటైన్) వంటి విషయాను పాటించడంలో పెద్ద పెద్ద పట్టణాలు మాత్రం విఫలమవుతుంటే పల్లెలు మాత్రం ఈ రెండింటినీ చాలా చక్కగా పాటిస్తున్నాయి.
ఈ వైరస్ మహమ్మారి బారిన పడకుండా ఉండేందుకు పల్లెలు అవసరమైన అన్ని జాగ్రత్తలు పాటిస్తున్నాయి. అందుకు ఉదాహరనే ఈ చిత్రం.సామాజిక దూరం పాటించే విషయంలో సదరు షాపు యజమాని మనిషికి మనిషికీ మధ్య ఆమడ దూరం ఉండేలా ముగ్గు పిండితో బాక్సులు గీయటం, షాపుకు వచ్చిన వ్యక్తులు ఓ క్రమ సంఖ్యను పాటించడంపై నెటిజెన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఈ చిత్రాన్ని చూసైనా పట్టణాల్లో ఉన్న ప్రజలు బుద్ధి తెచ్చుకోవాలని అంటున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ చిత్రాన్ని చూసివ నెటిజెన్స్ సదరు షాపు యజమానిని శభాష్ అని మెచ్చుకుంటున్నారు.