కరోనా ‘మేడ్ ఇన్ చైనా’ కాదు: జాలి పడాల్సింది పోయి ఇలా..

coro-vir

ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా వైరస్‌ను తొలిసారిగా గుర్తించి చైనా దేశంలోనే. అత్యధిక జానాభా మరియు విచిత్రపు ఆహార అలవాట్లు కలిగిన ఈ దేశంలో కరోనా దవానలంలా వ్యాపించి అనేక వేల మంది ప్రాణాలను బలికొంది. ఈ వైరస్ చైనాలోనే ఆగిపోకుండా అనేక ఇతర దేశాలకు కూడా వ్యాపించింది.

చైనా ఇప్పుడిప్పుడే కరోనా దాడి నుంచి కోలుకొంటోంది. అక్కడి దేశంలో ప్రజలు సుదీర్ఘ నిర్భందం తర్వాత మెల్లిగా బయట ప్రపంచంలోకి అడుగు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో.. ప్రపంచంలోని ఇతర దేశాలన్నీ కూడా చైనాపై దుమ్మెత్తి పోస్తున్నాయి, చైనా కరోనాను తమకు అంటగట్టి ఇప్పడు ప్రశాంతంగా ఉంటోదని విమర్శలు చేస్తున్నాయి.

గతంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా కరోనాను చైనీస్ వైరస్‌గా అభివర్ణించడం, ఆ తర్వాత దానిపై పలు విమర్శలు రావటం కూడా మనం విన్నాం. చైనాపై ఇప్పటికీ ఈ విమర్శలు వస్తూనే ఉన్నాయి, ఈ నేపథ్యంలో కోరనా వైరస్ మేడ్ ఇన్ చైనా వైరస్ కాదని, తమ దేశంలో అది గుర్తించబడిందే కానీ, దానీ మూలాలేంటని ఎవ్వరికీ తెలియదని చైనా చెబుతోంది.

కరోనాపై పోరాటంలో దాదాపు రెండు నెలల పాటు తాము నరకం అనుభవించామని, ఈ వైరస్ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తరుణంలో తమపై జాలి చూపించాల్సింది పోయి ఇలాంటి విమర్శలు చేయటం సరికాదని చైనా అంటోంది. కానీ ప్రపంచంలోని ఇతర దేశాలు మాత్రం తమ దుస్థితికి చైనానే కారణమని అన్ని వేళ్లను చైనా వైపే చూపిస్తున్నారు.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s