3 నెలలు లోన్స్ కట్టక్కర్లేదు..! మరి క్రెడిట్ కార్డులు కట్టాలా..?

రుణాలపై 3 నెలల మారటోరియం, మరి క్రెడిట్ కార్డులు కట్టాల్సిందేనా?
కరోనాను కట్టడి చేసేందుకు కేంద్ర తీసుకున్న కఠిన చర్యల కారణంగా భారత ఆర్థిక వ్యవస్థకు భారీ గండి పడనుంది. మరోవైపు ప్రస్తుతం అమల్లో ఉన్న లాక్డౌన్ కారణంగా జనజీవితం కూడా భారంగా సాగుతోంది. అనేక మంది ఉపాథి కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న వ్యక్తులకు ఊరట కల్పించేలా కేంద్రం కొన్ని ప్రతిపాధనలు చేసింది. ఈమేరకు అన్ని రకాల రుణాలపై 3 నెలల పాటు మారటోరియంను ప్రకటించింది.

భారత రిజర్వు బ్యాంక్ (ఆర్‌బీఐ) తెలిపిన వివరాల ప్రకారం, రానున్న మూడు నెలల పాటు గృహ, వాహన, వ్యక్తిగత రుణాలను కట్టకపోయినా ఫర్వాలేదని, ఇప్పుడు చెల్లించాల్సిన రుణాలను, ప్రస్తుత అత్యవసర పరిస్థితులు సద్దుమణిగిన తర్వాత చెల్లించుకోవచ్చునని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ అన్నారు. ఈ మూడు నెలల పాటు ఈఎంఐలు కట్టకపోయినా సిబిల్‌ స్కోర్‌పై ఎలాంటి ప్రభావం ఉండబోదని ఆయన స్పష్టం చేశారు.

దేశంలోని అన్ని రకాల బ్యాంకుల ఈఎంఐలపై ఆర్‌బీఐ మారటోరియం విధించింది. వీటిలో టర్మ్ లోన్స్ తో పాటుగా అన్ని రకాల నెల వాయిదాలు ఉన్నాయి. ఈ నిబంధన అటు కమర్షియల్, రీజనల్, రూరల్, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలకు కూడా వర్తిస్తుంది. దీని ఉద్దేశ్యం ఏంటంటే మారటోరియం అమలులో ఉన్నంత కాలం మీ జీతం నుంచి ఈఎంఐ పేరిట నెలసరి వాయిదా కట్ అవ్వదు.

మరి క్రెడిట్ కార్డుల పరిస్థితి ఏంటి?
మరి ఈ మారటోరియం క్రెడిట్ కార్డు బిల్లులకు వర్తించదా అనే అంశంపై కూడా ఆర్‌బీఐ స్పష్టతనిచ్చింది. వీటికి కూడా ఈఎంఐ మారటోరియం రూల్స్ వర్తిస్తాయని తెలిపింది. నెలవారీ ఈఎంఐలతో పాటు క్రెడిట్ కార్డు బకాయిలు కూడా మారటోరియం కిందకు వస్తాయని స్పష్టం చేసింది. దీంతో క్రెడిట్ కార్డుదారులకు ప్రయోజనం కలుగనుంది.
rbi

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s