వామ్మో రెడ్‌మీ నుంచి ఇంత పెద్ద ‘టీవీ’నా..?

redmitv98

రెడ్‌మీ ఉత్పత్తుల గురించి మనకు కొత్తగా పరిచయాలు అవసరం లేదు. స్మార్ట్ ఫోన్ విభాగంలో పెద్ద పెద్ద బ్రాండెడ్ కంపెనీలకే గట్టి పోటీ ఇస్తున్న ఈ చైనీస్ కంపెనీ ఇప్పుడు టెలివిజన్ మార్కెట్లో కూడా అడుగు పెట్టింది. చైనాకు చెందిన ఈ టెక్ కంపెనీ తాజాగా ఓ కొత్త మోడల్ టెలివిజన్‌ను మార్కెట్లో విడుదల చేసింది.

గరిష్టంగా 98 ఇంచ్‌ల స్కీన్ పరిమాణం కలిగిన టెలివిజన్‌ను రెడ్‌మీ ప్రకటించింది. రెడ్‌మీ టివి మ్యాక్స్ పేరుతో ఇప్పటికే చైనా మార్కెట్లో విడుదలైన ఈ టివి ధరను 19,999 యువాన్ (షుమారు రూ.2,10,000 )గా నిర్ణయించింది.

రెడ్‌మీ టివి మ్యాక్స్ 4కె వీడియో రెజల్యూషన్‌ను సపోర్ట్ చేస్తుంది. ఇందులో నైన్త్ జనరేషన్ ఇమేజ్ క్వాలిటీ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది 140000:1 డైనమిక్ కాంట్రాస్ట్ రేషియో, 192 పార్టిషన్ డైరెక్ట్ టైప్ డైనమిక్ బ్యాక్‌లైట్‌ను కలిగి ఉండి 85 శాతం ఎన్‌టిఎస్‌సి కలర్‌ను కవర్ చేస్తుందని కంపెనీ తమ ప్రెస్ రిలీజ్‌లో పేర్కొంది.

ప్రస్తుతానికి ఈ టెలివిజన్ చైనా మార్కెట్లో లభ్యం కానుంది. అయితే, ఇది గ్లోబల్ మార్కెట్లలో ఎప్పటి నుండి అందుబాటులోకి వస్తుందనే విషయాన్ని మాత్రం రెడ్‌మీ ఇంకా వెల్లడించలేదు.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s